నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హిందూపురం ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఇంకోవైపు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అది కాకుండా.. ఆహా ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి తనతో మరో యాంగిల్ ఎలా ఉంటుందో ప్రజలకు చూపించారు. తాజాగా ఈయన మన దేశంలోనే నెంబర్ 2 ప్లేస్‌లో నిలిచారు.తాజాగా కాన్సర్ హాస్పిటల్ చికిత్సలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఔట్ లుక్ అనే ఇంగ్లీష్ పత్రిక సర్వేలో తేలింది. ఈ హాస్పిటల్‌లో బాలయ్య తక్కువ ఖర్చులతో పేద ప్రజలకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు. ఈ హాస్పిటల్‌లోని సౌకర్యాలపై నెటిజన్స్ బాలయ్య తీరును ప్రశంసిస్తున్నారు.అంతేకాదు వేరు ఇతర హాస్పిటల్స్‌తో పోలిస్తే.. ఇక్కడ తక్కువ ఛార్జీలే వసూళు చేస్తున్నట్టు ఇక్కడ చికిత్స తీసుకున్న చాలా మంది వెల్లడించారు. అంతేకాదు ఈయన పనితీరులో ఈ హాస్పిటల్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ చికిత్స తీసుకుంటున్న చాలా మంది బాలయ్య మంచితనంతో పాటు గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు. బాలయ్య కెరీర్ పరంగా వ్యక్తిగతంగా మరింత ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 24వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. క్యాన్సర్ మహ్మమారి ప్రజలను పట్టి పీడిస్తోందని అన్నారు. ఇక, ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారం కోరామని తెలిపారు. అడిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని అన్నారు. దాతల సహయంతో బసవతారకం ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందన్నారు. భవిష్యత్‌లో బసవతారకం ఆస్పత్రి సేవలు మరింత విస్తరించాలని అన్నారు. కాగా, క్యాన్సర్ చికిత్స కోసం ప్రస్తుతం ఏపీ వాసులు హైదరాబాద్‌కు రావాల్సి వస్తోంది. త్వరలోనే ఏపీలో కూడా ఆసుపత్రిని నిర్మిస్తే ఇకపై వారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: