ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. ఆ పార్టీ తరపున 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేశారు.కానీ 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు మాత్రమే విజయం సాధించారు. దీంతో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ నేతలు రివ్యూ చేసుకొని ఓటమికి ఐదు ప్రధాన అంశాలు కారణమని తెలుసుకున్నారు.అదే విషయాన్ని తాజాగా మీడియా ముందుకు వచ్చిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిపై నిర్వేదం వ్యక్తం చేసి తమ పార్టీ ఓటమికి కారణాలను వెల్లడించారు.2019లో గురజాల నుంచి వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు కాసు మహేష్ రెడ్డి. ఈ ఎన్నికల్లో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు చేతిలో 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమి తర్వాత చాన్నాళ్లుగా ఆయన మీడియా ముందుకు రాలేదు. తాజాగా ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి  కారణమన్నారు.నాసిరకం మద్యం వైకాపా ఓటమికి ఒక కారణమని మద్యం తాగేవాళ్లు మాకు ఓటు వేయలేదని ఆ పాలసీని మార్చాలని ముందే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకపోయింది.ఇంకొక ప్రధాన కారణం ఇసుక విధానం వల్ల పేదవర్గాలు తీవ్రంగా నష్టపోయారు.అలాగే పార్టీలోని కొందరు వైసీపీ నేతల నోటి దురుసు కూడా ఓటమికి కారణమంటూ కొడాలి నాని, పేర్ని నాని, రోజా వంటి నేతలను ఉద్దేశించి ఆయ వ్యాఖ్యానించారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే అసలు వైసీపీకి భారీ నష్టం చేసిందని కాసు మహేశ్ రెడ్డి తెలిపారు.తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చి చంద్రబాబును బూతులు తిట్టారు అలాగే అసెంబ్లీలో చంద్రబాబును వల్లభనేని వంశీ అవమానించిన ఘటనను కూడా ఒక కారణమని ఆయన గుర్తు చేశారు.అలాంటి అవమానాలే చంద్రబాబుతో పాటు తెదేపా శ్రేణుల్లో కసిని పెంచాయి. ఎవరిని అవమానాలకు గురిచేసినా వారిలో కసి పెరిగి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోంది. అయితే మా ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటాం అని కాసు మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.2019లో జగన్ గెలిచినా, ఇప్పుడు చంద్రబాబు గెలిచినా అవమానాల నుంచి వచ్చిన కసే కారణం అని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ వాళ్లు గెలిచాక చాలా చోట్లు దాడులు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ కార్యాలయాన్ని సైతం కూల్చివేశారన్నారు. కూల్చివేత చట్ట పరంగా జరిగినా ఇంత తొందరగా చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: