రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసే పొలిటిషన్లు ప్రజలలో ఆశను రేకెత్తిస్తారు. వాళ్లు జీరో బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా సరే చివరికి సక్సెస్ సాధించగలరు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ నిరూపించారు. పదేళ్లపాటు రాజకీయాల్లో యాక్టివ్ గా కొనసాగడమే ఆయన విజయానికి ప్రధాన కారణం అయిపోయింది. పవర్ ఉంటే పవన్ ఏం చేస్తాడో చూడాలని చాలామంది అనుకున్నారు. అందుకే ఆయనకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. వారి కారణంగా పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ నిజమైన ప్రజానేతగా జనాలు చేస్తున్నారు. అందుకే ఆయన ఆఫీసు ముందు బారులు తీరుతున్నారు. తమ బాధలు తీర్చాలని కోరుతున్నారు.

అసెంబ్లీలో ఉన్న క్లీనింగ్ స్టాప్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ చేరి బాధలు చెప్పుకున్నారు. అంతేకాదు ఆయనపై విపరీతమైన అభిమానాన్ని కురిపించారు. సాధారణంగా ఈ స్టాప్ అనేవారు వేరే నేత వద్దకు వెళ్లే ధైర్యం చేయరు. ఎందుకంటే వారితో మాట్లాడితే కోప్పడి ఎక్కడ తీసేస్తారు ఏమో అని భయపడతారు కానీ పవన్ అలా చేసే వ్యక్తి కాదని మంచి చేసే మనసున్న నాయకుడు అని అందరూ నమ్ముతున్నారు. దాదాపు 150 మంది మహిళలు ఆయన చుట్టూ చేరి తాము 8 ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నామని, అమరావతి రైతు కూలీలమని చెప్పారు.

అసెంబ్లీ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అసెంబ్లీ హౌస్ కీపింగ్ స్టాఫ్ ఆయనను కలిశారు. అయితే పవన్ వాడితో చాలా పాజిటివ్ గా మాట్లాడాలి. అంతేకాదు వారితో సెల్ఫీలు కూడా దిగారు. వారి యోగక్షేమాలు అడుగుతూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శాసనసభను పరిశీలించారు. అయితే ఇక్కడ పని చేసేవారు తమకు 6,000 మాత్రమే ఇచ్చే వారిని ఇప్పుడు రూ.10,000 చేశారని ఇంతకుముందు అమరావతి కూలీలు అయినందుకు 2,500 భత్యంగా ఇచ్చే వారిని చెప్పారు.

అయితే ఇప్పుడు వాటిని నిలిపేసారని అవుట్ సోర్స్ గానే తాము పనిచేస్తున్నామని, పురపాలక సంఘాలుగా తమను గుర్తించి జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి పవన్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సంగతి తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనే నిజమైన హీరో అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: