పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. పదేళ్ల కష్టం తర్వాత రాజకీయాల్లో సక్సెస్ అయి ఒకేసారి భారీ విజయం సాధించాడు. పవన్ గెలవడమే కాక జనసేన అభ్యర్థులందని గెలిపించాడు. ఇక ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాడు. మంత్రిగా కూడా పలు శాఖలు తీసుకున్నాడు పవన్. పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది.జూన్ 24న అనగా సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు కోరనున్నారు. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు చర్చించనున్నారు.

పవన్ కళ్యాణ్ ని కలిసే వారిలో అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.పవన్ కళ్యాణ్ గెలిచినందుకు సినీ పరిశ్రమలోని ఓ స్టార్ నిర్మాత, పవన్ కళ్యాణ్ సన్నిహిత వ్యక్తి భారీగా ఓ పార్టీ నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్ లో ఆ నిర్మాత సినీ పరిశ్రమలోని ప్రముఖులకు, సినీ మీడియా వ్యక్తులకు ఈ పార్టీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఏపీలో ఇటీవల పవన్ కళ్యాణ్ గెలవడంతో పటు తన జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపించుకోవడంతో అభిమానులు కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. వీరితో పాటు సినీ పరిశ్రమకు సన్నిహితంగా ఉండే పలువురు కూడా ఈ ఎన్నికల్లో గెలవడంతో సినీ పరిశ్రమ సంతోషంలో ఉంది. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి అనేక మంది నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక సిబ్బంది ఏపీ ఫలితాలపై శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేసారు.ఇక పలువురు సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని కలిసి అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: