ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 40% ఓట్ పర్సంటేజ్ వచ్చినప్పటికీ... కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది వైసిపి పార్టీ. ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా పెద్ద లీడర్లు ఎవరు వైసీపీలో గెలవలేదు. తెలుగుదేశం కూటమి దెబ్బకు అందరు ఎగిరిపోయారు. దీంతో వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది.


అటు... తెలుగుదేశం కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అయితే అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి... వైసిపి పార్టీని చాలా ఇబ్బందులు పెడుతోంది. పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం, జగన్ పై కేసులు పెట్టడం లాంటివి చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీ ఓటమిపై...  ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు.

 

గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో... జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మద్యం పాలసీ తమ కొంప ముంచిందని... కాసు మహేష్ రెడ్డి ఆరోపణలు చేశారు. మందు బాబులే వైసిపికి ఓటు వేయలేదని ఆయన వెల్లడించారు. మద్యం పాలసీ పై తెలుగుదేశం కూటమి... తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ అయిందని తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన వారు... చంద్రబాబును తిట్టడం... తమ వైసిపి పార్టీ కి పెద్ద మైనస్ అయిందని ఆయన పేర్కొన్నారు.

 

చంద్రబాబును తిట్టకుండా... టిడిపి విధానాలపై ప్రశ్నిస్తే బాగుండేదని ఆయన వెల్లడించారు. నాసిరకం మధ్యాహ్నం ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని.. మందుబాబులు కూడా వైసీపీకి ఓటు వేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్  చట్టం కారణంగా.... వైసీపీకి మైనస్ అయిందని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మరిన్ని సీట్లను మార్చితే బాగుండేదని తెలిపారు. ఇక వైసిపి కార్యాల యాలను ధ్వంసం చేయడం అన్యాయమని.. కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: