తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పొద్దున లేస్తే చాలు ఒక్కో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్న నేతలు కూడా జారిపోతున్నారు. ఇప్పటికే నలుగురు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. అయితే తాజాగా మరో యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం గులాబీ పార్టీని కుదిపేస్తోంది.


ఆదివారం రోజున రాత్రి జగిత్యాల యంగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కవితకు అత్యంత సన్నిహితుడు.... గులాబీ పార్టీకి నమ్మకస్తుడు... అయిన సంజయ్ కుమార్... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ సందర్భంగా సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


ఇక ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. 2018 సంవత్సరంలో సంజయ్ కుమార్ ను నమ్మి టికెట్ ఇచ్చారు కేసీఆర్. అప్పుడు అఖండ మెజారిటీతో జగిత్యాలలో గులాబీ జెండా ఎగరవేశారు సంజయ్ కుమార్. ఇక మొన్న  కాంగ్రెస్ వేవులో కూడా.... జగిత్యాల నియోజకవర్గం లో సంజయ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించారు.


కెసిఆర్ ప్రభుత్వం... మన ఎన్నికల్లో  ఏర్పాటు అయి ఉంటే సంజయ్ కుమార్ కి మంత్రి పదవి కూడా వచ్చేది. ఇక ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో... అధికారం ఉన్న కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు సంజయ్ కుమార్. అయితే సంజయ్ కుమార్.. పార్టీని వీడటంతో కెసిఆర్ తో పాటు అందరూ షాక్ అవుతున్నారట.  అత్యంత నమ్మకస్తుడైన సంజయ్ కుమార్ ఇలా చేస్తాడని ఎవరు ఊహించుకోలేదట. కాగా రెండు రోజుల కిందటే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... బీఆర్ఎస్ పార్టీని కాదని..కాంగ్రెస్ లో చేరిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: