కొన్ని రోజుల క్రితమే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అందులో ఎన్ డి ఏ కూటమి భారీ మొత్తంలో పార్లమెంటు స్థానాలను దక్కించుకోవడంతో దేశంలో బిజెపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి కాంగ్రెస్ కోటమి కూడా పెద్ద మొత్తంలోనే పార్లమెంటు స్థానాలను దక్కించుకోవడంతో ఈ సారి లోక్ సభ లో ప్రతిపక్షం కూడా చాలా బలంగానే ఉంది. దానితో బిజెపి ఎలాంటి బిల్లులను తీసుకువచ్చిన ఎలాంటి ప్రతిపాదనలు చేసిన అవి జనాలకు మంచి చేయవు అనుకున్నట్లు అయితే కాంగ్రెస్ నుండి పెద్ద మొత్తంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.

ఈ రోజు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సారి బిజెపికి బలం కాస్త తక్కువ ఉండడం అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా పోటీ చేసిన తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు లోక్సభలో ఏమి మాట్లాడుతారా అనే దానిపై ఆంధ్ర ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఆంధ్ర ప్రజలు లోక్సభలో ఆంధ్రప్రదేశ్ నేతలు కొత్త రైల్వే లైన్స్, రోడ్ల గురించి చర్చ తీసుకువస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు రైల్వే లైన్స్ లేవు. దానితో రోడ్ ప్రయాణమే వారు చేస్తున్నారు.

అలా రైల్వే మార్గం లేని ప్రాంతాలకు కొత్త రైల్వే మార్గాలను తీసుకురా వచ్చే విషయంలో పోరాడడం. అలాగే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలను కలపడానికి జాతీయ రహదారులు సరిగ్గా లేవు వాటిని మెరుగుపరచాలి. అలాగే కొత్త జాతీయ రహదారులను కూడా కొన్ని ప్రాంతాలను కలుపుతూ వేయాలి అనే డిమాండ్ ను లోక్ సభలో ఆంధ్ర నాయకులు చర్చకు తీసుకువస్తే బాగుంటుంది అని జనాలు భావిస్తున్నారు. మరి ఈ రెండు అంశాల గురించి ఆంధ్ర నేతలు ఏ స్థాయిలో లోక్సభలో మాట్లాడుతారో ..? వాటిని ఏ స్థాయిలో సక్సెస్ చేస్తారా అనేది ఉత్కంఠ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: