కేంద్రంలో...  చక్రం తిప్పే అవకాశం ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చింది. ఎవరు ఊహించని విధంగా... ఎన్డీఏ కూటమికి  తక్కువ సీట్లు రావడంతో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది. ఇండియాలో... మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో... సొంతంగా బిజెపి పార్టీ 240 పైచిలుకు స్థానాలను మాత్రమే సంపాదించుకుంది. సొంతంగా 300కు పైగా సీట్లను సంపాదించుకుంటామని బిజెపి... విర్రవీగింది.


కానీ మోడీ ప్రభుత్వ ఆగడాలను భరించలేని భారత ప్రజలు... ఓటు కాంగ్రెస్ వైపు వేశారు.  దీంతో అనూహ్యంగా ఇండియా కూటమి బలంగా ఏర్పడింది. అయితే తక్కువ సీట్లు వచ్చిన బిజెపి పార్టీ... తమ మిత్రపక్షాలతో  ముచ్చటగా మూడవసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 16 స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ... ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే.


ఈ తరుణంలోనే చంద్రబాబు పార్టీ పార్లమెంటు సభ్యులకు రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు...  చంద్రబాబు నాయుడుకు మరో ఆఫర్ ఇచ్చేందుకు మోడీ నిర్ణయం తీసుకున్నారట. అదే లోక్సభ స్పీకర్ పదవి. టిడిపి ఎంపీలు ఎవరో ఒకరిని లోక్సభ స్పీకర్గా చేయాలని మోడీ ప్రతిపాదించారట. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారట.


వాస్తవానికి వాజ్పేయి కాలంలో.. అమలాపురం ఎంపీ చంద్ర బాల యోగిని స్పీకర్ గా నియామకం చేశారు. ఇక ఇప్పుడు చంద్రబాబు హయాంలో మరోసారి ఆ అవకాశం  తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అయితే ఇప్పటికే రెండు కేంద్రం మంత్రి పదవులు తీసుకున్న చంద్రబాబు నాయుడు... ఈ స్పీకర్ పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ చేస్తున్నారట. ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యం లో... స్పీకర్ పదవిపై క్లారిటీ రాబోతుందట. అటు పురందరేశ్వరి పేరు కూడా.... మోడీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి స్పీకర్ పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇవాళ తేలిపోనుందని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: