రైతు కుటుంబంలో పుట్టి లక్షల మంది జీవితాలను మార్చే స్థాయికి ఎదగడం అంటే సాధారణమైన విషయం కాదు. ఆ స్థాయికి ఎదగాలంటే కృషి, పట్టుదల, ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉండాలి. అయితే కోటిరెడ్డి సరిపల్లి విజయ ప్రస్థానం గురించి వింటే మాత్రం ఆ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వని వాళ్లు ఉండరు. పదో తరగతి చదువుతో ప్రపంచ స్థాయికి ఎదిగిన కోటిరెడ్డి దిగువ రైతు కుటుంబంలో జన్మించారు.
 
చిన్న వయస్సులోనే కంప్యూటర్ కోర్సులను నేర్చుకుని ఫోర్బ్స్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ కు ఎక్కే స్థాయికి ఎదిగిన వ్యక్తి కోటిరెడ్డి సరిపల్లి. ఇండియాలో కంపెనీ పెట్టి మన దేశ అభివృద్ధిలో భాగం కావాలని భావించిన కోటిరెడ్డి 2014 సంవత్సరంలో ఆ కలను నెరవేర్చుకున్నారు. కోటి గ్రూప్ ఆఫ్ వెంచ‌ర్స్, ర‌త్ ఇన్నోవేష‌న్ ల్యాబ్ ద్వారా ఎంతోమందికి కోటిరెడ్డి ఉద్యోగావకాశాలు కల్పించారు.
 
పదో తరగతి అర్హతతో మైక్రోసాఫ్ట్ యాప్ ఆర్కిటెక్ కోర్ టీంలో ప్రపంచం మొత్తం మీద ఉన్న నలుగురు సభ్యులలో కోటిరెడ్ది ఒకరు. ప్రస్తుతం 14 కంపెనీలకు బాస్ గా ఉన్న కోటిరెడ్డి తన సంపాదనలో 33 శాతం సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ మంచి మనస్సును చాటుకున్నారు. తన ప్రతిభతో చదువే చిన్నబోయేలా చేసిన కోటిరెడ్డి ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని ఆ లక్ష్యాలను సాధించి స్పూర్తిగా నిలిచారు.
 
కొంతమంది గొప్పదనం గురించి చెప్పడానికి అక్షరాలు, నిఘంటువులో ఉన్న పదాలు సైతం సరిపోవు. అలా కోటిరెడ్డి సరిపల్లి గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఒక ఐకాన్ గా నిలబడ్డ కోటిరెడ్డి ప్రణాళిక, ఆశయ సాధనతో అంతకంతకూ తను ఎదగడంతో పాటు తన సంస్థల్లో పని చేసే ఉద్యోగులు సైతం ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్న కోటిరెడ్డి సరిపల్లికి ఎవరూ సాటిరారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: