తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘోరంగా ఓడిపోవడం... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జీరో కు పడిపోవడం... కల్వకుంట్ల చంద్రశేఖర రావును వేధిస్తున్నాయి. అంతేకాకుండా గులాబీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంటుంది. రోజుకొక ఎమ్మెల్యే... కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.


అటు అధికారులు కూడా గులాబీ పార్టీ నేతలపై కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. పోలీసులైతే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హుజరాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్న పోలీస్ అధికారులకు అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.  అధికారి అయితే గులాబీ పార్టీకి ఇబ్బందులు పడుతున్నారో... వారి పేర్లు బ్లాక్ బుక్ లో రాస్తున్నామని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.


మరో నాలుగు సంవత్సరాలలోనే గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని... బ్లాక్ బుక్ లో ఉన్న పేర్లను బయటకు తీస్తామని... ఆ తర్వాత వారి తాటతీస్తామని హెచ్చరించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏపీలో కూడా బ్లాక్ బుక్  అంశం హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు పెట్టిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాసినట్లు నారా లోకేష్.. తరచూ చెప్పేవారు. దానికి తగ్గట్టుగానే ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయింది.

ఇప్పుడు కూడా ఆ రెడ్ బుక్ చూపిస్తూ... తమకు ఇబ్బంది పెట్టిన అధికారులకు చుక్కలు చూపిస్తామని చెబుతూనే ఉన్నారు. అంతే కాదు తమకు ఇబ్బందులు పెట్టిన అధికారులపై వేట్ కూడా వేస్తున్నారు. అయితే నారా లోకేష్ చెప్పినట్లుగానే... పాడి కౌశిక్ రెడ్డి చెబుతున్నారు. అంటే ఏపీలో సీన్ కూడా తెలంగాణలో రిపీట్ కాబోతుందని... కొంతమంది అంటున్నారు. అదే నిజమైతే గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చాక... బ్లాక్ బుక్ లో ఉన్న అధికారులకు చుక్కలు కనిపించడం ఖాయమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: