ఏపీలో కొలువుదీరిన కొత్త అసెంబ్లీకి కొంగొత్త విష‌యాలు తోర‌ణాలుగా మారాయి. కూట‌మి విజ‌యం ద‌క్కిం చుకున్న త‌ర్వాత‌.. స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం కోసం శుక్ర‌వారం స‌భ కొలువుదీరుతోంది. రెండు రోజుల పాటు 174 మంది స‌భ్యుల‌తో ప్రొటెం స్పీకర్ ప్ర‌మాణం చేయించ‌నున్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఈ సారి స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్  ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మార‌రు. జ‌న‌సేన త‌ర‌ఫున ఎన్నికైన ఆయ‌న తొలిసారి స‌భ‌లోకి అడుగులు వేస్తున్నారు.


+ ఇక‌, గ‌త రెండు సంవ‌త్స‌రాల కింద‌ట‌.. వైసీపీ స‌భ్యుల‌పై నిప్పులు చెరిగిన‌. అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు.. కౌర‌వ స‌భ‌లో ఉండ‌న‌ని.. గౌర‌వ స‌భ ఏర్ప‌డిన త‌ర్వాతే.. తాను సీఎంగా అడుగులు వేస్తాన‌ని చెప్పారు. అనుకున్న‌ట్టుగానే..  ఈసారి ఎన్నికల్లో ఆయ‌న కూట‌మికి ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. ద‌రిమిలా చంద్ర‌బాబు అమిత‌మైన ఆనందంతో అడుగులు వేస్తున్నారు.


+  గ‌త ఐదేళ్ల‌లో స‌భ‌లో అసలు ప్రాతినిధ్యం లేని బీజేపీకి ఈ ద‌ఫా 8 మంది ఎమ్మెల్యేలు ల‌భించారు. దీంతో సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. స‌భ‌లో అడుగు పెడుతున్న పార్టీగా బీజేపీ రికార్డు నెల‌కొల్పింది. పైగా..గ‌తంలో ఇంత మంది స‌భ్యులు ఆ పార్టీకి ద‌క్క‌క పోవ‌డం గ‌మ‌నార్హం.


+ ఏపీ విభ‌జ‌న త‌ర్వాత‌.. తొలి సారి జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో 67 స్థానాల‌తో అసెంబ్లీకి వెళ్లిన వైసీపీ అధినేత .. 2019కి వ‌చ్చేస‌రికిక‌నీ వినీ ఎరుగ‌ని విజ‌యం అందుకుని 151 మంది స‌భ్యుల‌తో స‌భ‌లోకి అడుగులు వేశారు. అయితే.. ఇప్పుడు అదే పార్టీ.. కేవ‌లం 11 స్థానాల‌తో ప‌రిమిత‌మై.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఠీవీగా అడుగు పెట్టిన స‌భ‌లో బిక్కుబిక్కు మంటూ.. చివ‌రి వ‌రుస‌లో కోర్చునే ఏర్ప‌డింది.


+ ఫైర్ బ్రాండ్ లేని స‌భ‌ను తొలిసారి ప్ర‌జ‌లు ఎంచుకున్నారు.
+ నిర్మాణాత్మ‌క చ‌ర్చ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చే.. నాదెండ్ల మ‌నోహ‌ర్‌, స‌త్యకుమార్‌.. వంటివారు స‌భ‌ల్లో అడుగు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: