- ఏపీకి ఈ ఎయిర్ పోర్ట్ తలమానికం అవుతుందా.?
- ప్రత్యేక నిధులు కేంద్రం కేటాయిస్తుందా.?
- కింజారపు విమాన వేగంతో పనులు చేయిస్తారా.?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టిడిపి కూటమి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మొత్తం రాష్ట్రం నుంచి కూటమి తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచినటువంటి మొత్తం 25 మంది ఎంపీలకు  రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయే బాధ్యత ఉంది. రాష్ట్రంలో  విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిపై పార్లమెంటులో వీరి గలాన్ని వినిపించి  నిధులు కేటాయించుకుని రాష్ట్ర అభివృద్ధికి  పాటుపడవలసిన అవసరం ఎంతో ఉంది. అలాంటి ఈ తరుణంలో  ఆంధ్రుల చిరకాల వాంఛ భోగాపురం ఎయిర్ పోర్ట్  కూడా కేంద్ర నిధులతో పూర్తి చేయాలి. దీనికోసం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా  నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసే అవసరం ఎంతైనా ఉంది. మరి భోగాపురం పనులు ఎక్కడి వరకు వచ్చాయి దానికి ఇంకెన్ని నిధులు కావాలి అనే వివరాలు చూద్దాం.

 
 ఉత్తరాంధ్ర ప్రజల బంగారు కళ అయినటువంటి భోగాపురం ఎయిర్ పోర్ట్, గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ టిడిపి కూటమి అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్ట్ అభివృద్ధి దిశలో దూసుకుపోతుందని అంటున్నారు.  దీనికి ప్రధాన కారణం ఏపీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి కింజారాపు రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా ఉండడమే. దీని కోసం ఆయన కేంద్ర పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడి మరి దీనికి నిధులు కేటాయించుకునే అవకాశం ఉంది. ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగితే ఏపీకి వచ్చే లాభాలు, ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది కూడా ఆయన  ఇదివరకే పార్లమెంట్ లో గట్టిగా వినిపించారు.  ఈసారి కూడా ఈ విషయాన్ని లేవనెత్తి  ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించుకోవాలనేది ప్రథమ లక్ష్యం. మొత్తం 2203 ఎకరాల్లో 4750 కోట్ల బడ్జెట్ తో ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. ఏపీఎడిసిఎల్ పర్యవేక్షణలో,  జిఎంఆర్ సంస్థ నేతృత్వంలో ఎయిర్  పోర్ట్ నిర్మాణం పూర్తి చేయాలి. అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్రం నుంచి నిధులు కేటాయించి  కొన్ని నెలల్లోనే పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల కలలు నెరవేర్చాలని  అంటున్నారు.  మరి చూడాలి కింజారపు ఈ పనిని పూర్తి చేస్తారా లేదంటే గత ప్రభుత్వాలు లాగానే  కుంటుపడేస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: