రేవంత్ రెడ్డి నిర్ణయాలు.. కాంగ్రెస్ సీనియర్ నేతలకు కోపాలు తెప్పిస్తున్నాయి. తాజాగా... సీఎం రేవంత్ రెడ్డి పై జగిత్యాల కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సీనియర్లకు వ్యాల్యూ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని... సీనియర్ లీడర్లకు అన్యాయం చేస్తున్నాడని జగిత్యాల కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆదివారం రోజు అర్ధరాత్రి జగిత్యాల గులాబీ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్... కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో... ఆదివారం రోజున... కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, జగిత్యాల యువ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా... స్వయంగా రేవంత్ రెడ్డి కండువా కప్పి మరి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను... కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అయితే ఈ విషయం ఎమ్మెల్సీ నాయకులు, జగిత్యాల టైగర్ జీవన్ రెడ్డికి  కోపాన్ని తెప్పించింది.

 
పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితేనే సీరియస్ అయినా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి... ఇప్పుడు తన ప్రత్యర్థి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్... కాంగ్రెస్ లోకి రావడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జగిత్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ.. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో జీవన్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే దీనిపై వెనక్కి తగ్గాలని రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చేందుకు... జీవన్ రెడ్డి వర్గం ప్రయత్నాలు చేస్తుందట.
 

గత పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించిన సంజయ్ కుమార్ ను ఎలా పార్టీలోకి... చేర్చుకుంటారని జీవన్ రెడ్డి వర్గం మండిపడుతోంది. అంతేకాకుండా...  సంజయ్ ని బయటికి పంపించకపోతే... తామే కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్తామని జీవన్ రెడ్డి... కూడా కార్యకర్తలతో చర్చిస్తున్నారట. దీంతో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం... హాట్ టాపిక్ అయింది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: