జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెండి తెర మీద వెలుగుతున్న ఓ ప్రభంజనం. ఆయన సినిమా కోసం కొన్ని కోట్లమంది జనాలు పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇక సినిమా రిలీజైతే ఫాన్స్ పూనకాలతో ఊగిపోతారు. అంతటి చరిష్మా ఉన్న పవన్ చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు పెండింగ్ దశలో ఉన్నాయి. ఎన్నికలు సమీపించడంతో ఆయన షూటింగులు ఆపు చేసుకుని మరీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో కూటమికి ప్రచారం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు జనసేనాని. ఎన్నికల ఫలితాలు రావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. పవన్ కి అత్యంత కీలకమైన శాఖ లతో కూడిన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు లభించాయి. దాంతో పవన్ తనకు దక్కిన శాఖల విషయంలో పూర్తి అధ్యయనం చేసే పనిలో పడిపోయారు.

ప్రభుత్వ కార్యక్రమాలలో పవన్ ఒక విధంగా చూస్తే ఫుల్ బిజీ అయిపోయారనే చెప్పుకోవాలి. ఈ తరుణంలో పవన్ సినిమాల సంగతి ఏంటి? అనే అంశం అభిమానులకు అంతుపట్టడంలేదు. ఇదిలా ఉంటే పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కోసం ఆయన జూలైలో హాజరవుతున్నారని వచ్చిన వార్తలు అన్నీ నిరాధారం అంటున్నారు కొంతమంది. పవన్ ఇప్పట్లో సినిమాల వైపు చూడరని చెబుతున్నారు. ఆయన ఎంతో ఇష్టపడి ఎంచుకున్న రంగం రాజకీయంలో ఆయన ఇక పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటారని, సినిమాలు ఇక స్పష్టమేనని చెప్పుకుంటున్నారు.

ఎందుకంటే... పవన్ ప్రస్తుతం మంగళగిరి పార్టీ ఆఫీసుని వదిలి రావడం లేదు. ఆయన హైదరాబాద్ లోని తన నివాసాన్ని కూడా మార్చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అటు సచివాలయం ఇటు క్యాంప్ ఆఫీసు లేకపోతే మంగళగిరిలోని పార్టీ ఆఫీసు ఇలా పవన్ దిన చర్య ఉంటోందని అంటున్నారు. ఏది ఏమైనా తాను ఇప్పటిదాకా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఆ మీదట కొత్త వాటిని ఒప్పుకోవాలా వద్దా అన్నది పవన్ ఆలోచిస్తారు మరికొందరు జోష్యం చెబుతున్నారు. కారణాలు ఎలా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు తన అభిమాని సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చేయాలని మనసారా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పవన్ మీటింగులే తప్ప నో షూటింగులు అని అంటున్నాడని వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: