ఇవాళ్టి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొన్నటి వరకు 17 వ లోక్సభ సమావేశాలు జరగగా... ఇవాల్టి నుంచి కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో 18వ లోక్ సభ తొలి సమావేశాలు ప్రారంభం కావడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులతో ప్రోటీన్స్ స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఈ రోజున ఏకంగా 280 ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.


ఇలాంటి తరుణంలో... పార్లమెంట్ ఆవరణలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. పార్లమెంట్ భవనానికి సైకిల్ పై చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడు. విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల విజయం సాధించారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లోక్సభ లో మొదటిసారి అడుగుపెట్టనున్నారు అప్పలనాయుడు.


దీంతో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తన పార్టీ గుర్తు అయిన సైకిల్ ను అందరికీ గుర్తు చేస్తూ సైకిల్ పైనే పార్లమెంట్కు వచ్చారు అప్పలనాయుడు. తెలుగుదేశం పార్టీ కలర్ దుస్తులు ధరించి సైకిల్ పైన పార్లమెంటుకు వచ్చారు. దీంతో... ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన చూసిన తోటి పార్లమెంటు సభ్యులు... ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక ఎంపీ అయి ఉండి...  సామాన్య పౌరుడిలా సైకిల్ పైన రావడం చాలా గ్రేట్ అంటున్నారు.


ఇది ఇలా ఉండగా... కలిశెట్టి అప్పలనాయుడు... దాదాపు 15 లక్షల  ఓటర్లకు ఎంపిక వ్యవహరిస్తున్నారు.  విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన అఖండ మెజారిటీతో విజయం సాధించారు. వైసిపి అభ్యర్థి పై దాదాపు 2 లక్షల 30 వేల ఓట్ల తేడాతో... విజయం సాధించారు అప్పలనాయుడు. ఆయన ఎంపీగా గెలవడం ఇదే మొదటిసారి. అంతకుముందు జర్నలిస్టుగా... ప్రజాసేవకుడిగా అనేక సేవలు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: