వ్య‌క్తులుగానే అంద‌రూ పుడ‌తారు. కానీ, వ్య‌వ‌స్థ‌లుగా మారేవారు.. వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు  చేసేవారు.. వ్య‌వ‌స్థ ల‌కు ప్రాణ‌ప్ర‌తిష్ట చేసేవారు మాత్రం కొంద‌రే ఉంటారు. అలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉంటారు.. టెక్ దిగ్గ‌జం.. కోటి గ్రూప్ ఆఫ్ వెంచ‌ర్స్ అధినేత‌.. స‌రిప‌ల్లి కోటిరెడ్డి. నాకేంటి ?  మాకేంటి ? అనే రోజులు న‌డుస్తున్న‌నేడు..  వసుధైక కుటుంబం అంటూ.. ఈ ప్రపంచానికి ఏదైనా మేలు చేయాల‌నే ఏకైక ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అనేక వ్యాపారాలు.. అనేక ప‌రిశ్ర‌మ‌లు.. అనేక సంస్థ‌లు.. స్థాపించి.. త‌ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ఏదైనా మేలు చేయాల‌నే త‌లంపుతో ముందుకు సాగుతున్న స‌రిప‌ల్లికి.. స‌రిలేరు.. అన‌డంలో సందేహ‌మే లేదు.


మీడియా. ఎంట‌ర్‌టైన్‌మెంట్, టెక్ సంస్థ‌లు, చిన్నారుల వైద్యం.. ఇలా దేనిక‌దే భిన్నం. దేనిక‌దే విభి న్నం. కానీ.. వీటి అంత‌ర సూత్రం మాత్రం ఒక్క‌టే.. అదే.. ప్ర‌జ‌ల కు ఏదైనా మేలు చేయ‌డం.. అదేదో .. అన్నం తిన్న చేత్తో.. విసిరిన‌ట్టు కాదు..  మ‌న‌సు పెట్టి చేయ‌డం.. మ‌నిషిగా చేయ‌డం.. అనే సూత్రాన్ని పుణికి పుచ్చుకున్నారు.. స‌రిప‌ల్లి. ఇదే ఆయ‌న‌కు అన‌తి కాలంలోనే పేరు తెచ్చింది.


ఉన్న‌ది డెవ‌ల‌ప్ చేయ‌డం గొప్పనిఅనుకోవ‌డంలో త‌ప్పు లేక పోవ‌చ్చు. కానీ, లేద‌ని సాధించ‌డంలో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది.. అంటారు త‌న పుస్త‌కం.. వింగ్స్ ఆఫ్ ఫైర్‌లో మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం. ఇలాంటి వారి నుంచి స్ఫూర్తి పొందిన స‌రిప‌ల్లి.. త‌ను చేప‌ట్టే ప్ర‌తి ప‌నిలోనూ.. ప్ర‌జా శ్రేయ‌స్సుకు పెద్ద‌పీట వేస్తారు. అనేక వంద‌ల సంస్థ‌లు స్థాపించారు. వాటిలో వేలాది మందికి ఉపాధి క‌ల్పించారు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలో చిన్న ప‌ల్లెటూరు నుంచి మైక్రోసాఫ్ట్ వ‌ర‌కు ఆయ‌న ప్ర‌స్థానం అంచెలంచెలుగా కొన‌సాగింది.


ప్ర‌త్య‌క్షంగా వేల సంఖ్య‌లో అయినా.. ప‌రోక్షంలో ల‌క్ష‌ల మంది ఈ రోజు.. స‌రిప‌ల్లి కోటి వెంచ‌ర్స్‌లో ఉపాధి పొందుతున్నార‌న‌డంలో సందేహం లేదు. ఆయ‌న సేవ‌ల‌ను గుర్తించిన అనేక సంస్థ‌లు ఇప్ప‌టికే అనేక బ‌హుమానాలు.. బిరుదులు.. అవార్డుల‌తో ఆయ‌న సేవ‌ల‌కు గుర్తింపు ఇచ్చాయి. అలాగే ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో భార‌త్ వ‌ర్చువ‌ల్ పీస్ అండ్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ‌.. స‌రిప‌ల్లికి.. మ‌రో అవార్డును ప్ర‌క‌టించింది. డాక్ట‌రేట్ తో ఆయ‌నను ఘ‌నంగా స‌త్క‌రించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: