ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. చంద్రబాబుతో కలిసి రాకపోతే మాత్రం 100% అక్కడ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది.  ఈ విషయాన్ని ముందే గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ టిడిపితో కూటమిగా ఏర్పడి ఒక్క ఓటు కూడా చీలిపోకుండా కూటమికి పడేటట్టు చేశారు. ఈ విధంగా  కష్టపడ్డారు కాబట్టి ఈరోజు చంద్రబాబు సీఎం అవ్వగలిగారు. అంత కష్టపడ్డ పవన్ కు చంద్రబాబు అరుదైన గౌరవాన్ని ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి అప్పగించారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుకు ఏ విధమైనటువంటి భద్రత ఉంటుందో  ఆ విధంగానే సమానమైన భద్రత పవన్ కు కూడా అందించారు. 

అలాంటి పవన్ కళ్యాణ్ కు మరో అరుదైన గౌరవం ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఇంతకీ అది ఏంటయ్యా అంటే.. పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ పథకాలకు పెట్టాలని అనుకుంటున్నారట. ఆ పథకం కూడా యువకులకు కనెక్ట్ అయ్యే పథకం అయితే బాగుంటుందని యోచిస్తున్నారట. చంద్రబాబు ఎప్పుడైతే జైలుకు వెళ్లారో అప్పటినుంచి పార్టీని తన భుజాలపై వేసుకొని రాష్ట్రంలో టిడిపి నాయకులకు అండగా నిలిచారు పవన్ కళ్యాణ్. చివరికి తాను అనుకున్న విధంగానే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో యువత ఓట్లు ఒక్కటి కూడా వైసిపికి పడకుండా  కూటమికే పడేటట్టు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గౌరవ మర్యాదలు పెరిగేలా ఒక ప్రభుత్వ పథకానికి ఆయన పేరు పెట్టాలని భావిస్తున్నారట.

 ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మరియు చంద్రబాబు పేరుతో అనేక పథకాలు వచ్చాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్ మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో పథకాలు వచ్చాయి. ప్రస్తుతం మళ్ళీ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి  ఎన్నో ప్రభుత్వ పథకాలు అమలయ్యాయి. ఇదే తరుణంలో ఎన్టీఆర్, చంద్రన్న పేరుతో ఉన్నటువంటి కొన్ని పథకాలను పునరుద్ధరించాలని అనుకుంటున్నారట. ఇదే తరుణంలో పవన్ యువ వికాసం అనే పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చంద్రబాబు భావించారట. ఒకవేళ ఇది జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ పేరు మరింత మారుమోగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: