ఈరోజు ఉదయం నుంచి వైసీపీ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు కార్యకర్తలు సైతం షాక్ కి గురయ్యారు. తాజాగా ఇలాంటి రూమర్లు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి విశాఖలో పలు రకాల వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ వచ్చినట్లుగా సమాచారం. మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్లీపింగ్ టాబ్లెట్ లు వేసుకొని రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఉదయం 3 గంటలకు కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి మేనేజ్ చేశారనే విధంగా వార్తలు వినిపించాయి.


ఈ విషయం ఆ నోట ఈ నోట పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదిప్  రాజ్ వద్దకు వెళ్లగా ఆయన క్లారిటీ ఇచ్చారు. నిన్నటి రోజున రాత్రి డిన్నర్ తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఈరోజు తెల్లవారుజామున హాస్పిటల్కి వెళ్లి డిశ్చార్జ్ కూడా అయ్యాను అంటూ ఒక వీడియో ద్వారా వెల్లడించారు. నిన్నటి రోజున సాయంత్రం వైసీపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్మించామని కావాలంటే ఎవరైనా వెళ్లి కనుక్కోవచ్చు.. పార్టీని బలోపేతం చేయడంలో అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామంటూ తెలిపారు అదిప్ రాజ్.


ఇలాంటి అపోహలు ఎవరు నమ్మవద్దు అంటూ తను ఆరోగ్యంగా ఉండాలంటూ తెలిపారు అదిప్. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ కేసు నమోదు అయ్యిందనే విధంగా ప్రచారం వచ్చినప్పటికీ అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారించగా ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిసిందట.ఈ సమయంలోనే ఆయన కాస్త ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతట ఈ విషయం వైరల్ గా మారడంతో ఆయన వీడియోతో ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా దీంతో చాలా మంది ఫోన్లో చేసి మాట్లాడుతున్నారని కూడా తెలుపుతున్నారు. అయితే ఇలాంటి ఫేక్ వార్తలు ఎవరో కావాలని సృష్టించారు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: