ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చింది  మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం  లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరి వారు అందించేవారు.  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైగా వాలంటీర్లను నియమించారు. వీరి ద్వారానే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలను ప్రజలకు అందించారు. దీంతో చాలామంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బ్యాంకులకు వెళ్లకుండానే ఇంటి వద్ద పింఛన్, రేషన్ అన్ని అందుకున్నారు. అలాంటి వాలంటరీ వ్యవస్థను  తీసుకొచ్చినటువంటి వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఘోరంగా పరాభవం పొందింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది.

 అలాంటి ఈ తరుణంలో వాలంటరీ వ్యవస్థను  వీరు కొనసాగిస్తారని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదు ఉన్న వాలంటీర్లకు 10,000 కు పైగా జీతాన్ని అందిస్తామని కూడా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా  చెప్పినటువంటి చంద్రబాబు ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థను తీసేసే పనిలో పడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  దీనికి ప్రధాన కారణం వారు క్యాబినెట్ లో తీసుకున్న ఈ నిర్ణయమే. దీన్ని బట్టి చూస్తే మాత్రం వాలంటరీ వ్యవస్థను తీసేసే అవకాశం ఉందని కొంతమంది అనుకుంటున్నారు. ఇంతకీ వారు ఏ నిర్ణయం తీసుకున్నారయ్యా అంటే జూలై ఒకటో తేదీన వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరికీ ఇంటి దగ్గరికి వెళ్లి వారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని వారి చేతిలో పెట్టాలని  కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.

 మరి వారికి వాలంటీర్లు వెళ్లి  పింఛన్లు పంచుతారా అంటే వాళ్లు కాదట. సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇతర పథకాలన్నీ ప్రజలకు అందించాలట. కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకోవడంపై చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వాలంటరీ వ్యవస్థను ఈ ప్రభుత్వం తీసేస్తుందా అని కూడా భయపడుతున్నారు. మరి చూడాలి ఈ ఒక్కసారికి సచివాలయ సిబ్బంది పంచుతారా? లేదంటే పర్మినెంట్ గా వారే పంచి  వాలంటీర్లకు మంగళం పెడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: