ఆంధ్రప్రదేశ్ తాజా డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ తో టాలీవుడ్ సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. అల్లు అరవింద్, అశ్వనీదత్, ఏఎం రత్నం, దిల్‌రాజు ఇంకా అలాగే దగ్గుపాటి సురేష్ సహా పలువురు సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ని కలిశారు.సినిమాటోగ్రఫీశాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినీరంగ అభివృద్ధి, విస్తరణపై చర్చించారు. డిప్యూటీ సీఎంని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు నిర్మాత అల్లు అరవింద్. టికెట్ల అంశం అనేది చాలా చిన్న విషయం. అంతకన్నా పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. వాటిపై త్వరలోనే ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తామని అన్నారు. సినీ ఇండస్ట్రీ తరపున అభినందించేందుకు సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇప్పించాలని కోరామన్నారు అల్లు అరవింద్. చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ ఇస్తే.. సినీ ఇండస్ట్రీలోని అన్ని అసోషియేషన్ల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి సీఎంకి సన్మానం చేయనున్నారు. 


ఇండస్ట్రీలోని సమస్యలపై సీఎంకు వినతిపత్రం ఇచ్చే ఆలోచనలో ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీ.మరోవైపు ముఖ్యమంత్రి ఇంకా అలాగే ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు అల్లు అరవింద్ తెలిపారు. తమ విజ్ఞప్తికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు అల్లు అరవింద్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఖచ్చితంగా మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు ఇంకా అలాగే రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్ ,నిర్మాతలు సి.అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, డి.సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ ఇంకా వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: