ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లను వైసీపీ పార్టీ తీసుకువచ్చింది. మాజీ సీఎం జగన్ అమలు చేసిన కొన్ని పథకాల పేర్లను కూడా మార్చి కొన్నిటిని కొనసాగిస్తూ ఉన్నారు చంద్రబాబు అయితే ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ కు ఎన్నికల ముందు పదివేల జీతం అంటూ ఆకర్షింపజేసిన చంద్రబాబు ఇప్పుడు వారిని ఎలా వినియోగించుకోవాలి అనే అంశం పైన ప్రభుత్వం సమలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చిన చంద్రబాబు వాలంటరీ వ్యవస్థ కొనసాగించే అవకాశాలు ఉన్న వారికి విధివిధానాలు ఏంటి అనే విషయం పైన ఇంకా క్లారిటీ రావడం లేదట.


నిన్నటి రోజు జరిగిన తొలి క్యాబినెట్ లో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.ముఖ్యంగా పెన్షన్ పంపిణీ వాలంటరీలను దూరంగా ఉంచాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.అలాగే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్ ని పంపిణీ చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఒకటవ తేదీన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లను డోరు డెలివరీ చేయబోతున్నారు ఏపీ ప్రభుత్వం. వాలంటీలను ఎలా ఉపయోగించుకోవాలని విషయం పైన ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేస్తుందని కూడా మంత్రి కోలుసు పార్థసారథి వెల్లడించారు.

ఏపీ క్యాబినెట్లో పింఛన్ల పెంపు ఆమోదం కూడా వచ్చేసింది ఎన్టీఆర్ భరోసా పేరిట సామాజిక పింఛన్ మొత్తాన్ని మూడు నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచారు. ఈ పెంచిన పింఛన్ మొత్తాన్ని సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు పంపించేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచి ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు నెలలకు ఒక్కొక్క నెలకు ₹1000 చొప్పున 3000 పాత బకాయిలతో పాటు 4000 కొత్త బకాయితో మొత్తం 7000 అందించబోతున్నారు. మరి వాలంటరీ వ్యవస్థను ఇలాగే కొనసాగిస్తారా లేకపోతే మొత్తంలో మొత్తం తగ్గిస్తారా అనే విషయంపై కూడా మరి కొద్ది రోజులలో క్లారిటీ రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: