- దారుణంగా ప‌డిపోయిన సాక్షి పేప‌ర్ స‌ర్యులేష‌న్‌
- ఏపీలో ప్ర‌సారాలు క‌ట్‌తో సాక్షి ఛానెల్ టీఆర్పీ డౌన్‌..?

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఐదేళ్లు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు సాక్షి మీడియా వెలుగు వెలిగింది. సాక్షి పేప‌ర్‌కు కావాల్సిన‌న్ని యాడ్స్‌తో పాటు సాక్షి ఛానెల్ హ‌వా ఓ రేంజ్‌లో కొన‌సాగింది. ఎప్పుడు అయితే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యారో వెంట‌నే సాక్షికి ఏపీలో క‌ష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ‌లో ఆ మీడియాను దేకేవారే లేకుండా పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు.. రేవంత్ రెడ్డి సాక్షికి ప్ర‌యార్టీ ఇవ్వ‌రు. ఇక ఏపీలో ఇప్ప‌టికే సాక్షి టీవీని కేబుల్ ఆపరేటర్లు స్వచ్చందంగా నిలిపివేశారు.


ఇక ఆ ఛానెల్ టీఆర్పీ రేటింగ్ దారుణంగా ప‌డిపోవ‌డం ఖాయం. ఇక ఇప్పుడు సాక్షి పేప‌ర్ వంతు కూడా వ‌చ్చేసింది. సాక్షి పత్రికను కూడా స్వచ్చందంగా బహిష్కరిస్తున్న వాతావ‌ర‌ణం బాగా కనిపిస్తుంది. వాలంటీర్లకు ఇచ్చే న్యూస్ పేపర్ అలవెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వాళ్ల‌కు నెల‌కు పేప‌ర్‌కు ఇచ్చే రు. 200 కోత పెట్టేశారు. గ‌తంలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు సాక్షి స‌ర్కులేష‌న్ పెంచేందుకు ప్ర‌జాధ‌నంతో వ‌లంటీర్ల‌కు, స‌చివాల‌య సిబ్బందికి సాక్షి పేప‌ర్ వేసి ప్ర‌జాధ‌నంతో సాక్షికి పెట్టేసేవారు.


ఇక ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు కూడా సాక్షిగా భారీగా వెళ్లేవి. వాలంటీర్లతో రెండున్నర లక్షలు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో మరో లక్షన్నర, అలాగే వార్డు సచివాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, వైసీపీ నేతలపై ఒత్తిడి తెచ్చి మరికొన్ని కాపీలు బ‌ల‌వంతంగా కొనిపించి ఈనాడు స‌ర్యులేష‌న్‌ను దాటించాల‌ని విఫ‌ల ప్ర‌య‌త్నాలు చేసి చివ‌ర‌కు చేతులు ఎత్తేశారు. ఇప్పుడు స‌ర్యులేష‌న్ ఢాంన ప‌డిపోయింది. ఇక ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లే కాదు.. చివ‌ర‌కు వైసీపీ నాయ‌కులు కూడా సాక్షిని ప‌ట్టించుకునేంత టైం లేని దిగాలుగా ఉన్నారు. అలా అయ్యింది సాక్షి మీడియా ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: