( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఎంత కాద‌నుకున్నా.. ఎంత ఔన‌నుకున్నా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌.. ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రు దోస్తులుగానే కొన‌సాగారు.. వీరు ముఖ్య‌మంత్రులుగా ఉన్నంత కాలం... కేసీఆర్ ఎప్పుడు అయితే ప‌ద‌వి దిగిపోయారో... జ‌గ‌న్‌లోనూ టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. ఆరు నెల‌ల్లోనే జ‌గ‌న్ కూడా సీఎం కుర్చీ నుంచి గ‌ద్దె దిగిపోయారు. ఇక ఇప్పుడు ఇద్ద‌రూ మాజీ సీఎం లు అయిపోయారు. పైగా ఈ ఇద్ద‌రికి కామ‌న్ శ‌త్రువులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల‌కు సీఎంలుగా ఉన్నారు.


అయితే ఇప్పుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఫాలో అవుతున్నట్టుగా నే వాతావ‌ర‌ణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును కేసీఆర్ హుందాగా స్వీక‌రించ‌లేక‌పోయారు. అస‌లు ఆయ‌న తొలి రోజు ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు కూడా అసెంబ్లీకి రాలేదు. ప‌దేళ్లు సీఎంగా ఉన్న ఆయ‌న ఒక్క ఓట‌మి దెబ్బ‌తో అస‌లు త‌న మొఖాన్ని ప్ర‌జ‌ల‌కు చూపించేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు.


దీనికి తోడు ఇటీవ‌ల పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూడా తెలంగాణ‌లో ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్‌కు రాలేదు. దీంతో కేసీఆర్ పూర్తిగా ఫామ్‌హౌస్‌కో లేదా ఎక్క‌డ ఉన్నా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డ‌ట్లేదు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ కేసీఆర్ రూట్లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు.. త‌న మొఖం జ‌నాల‌కు చూపించేందుకు ఇష్ట‌ప‌డ‌ట్లేదు. జ‌గ‌న్ ఎల‌హంక లోని త‌న ప్యాలెస్‌లో ఉండేందుకు బెంగళూర్ కు మకాం మార్చారు. అక్కడ జగన్ ఎన్ని రోజులు ఉంటారో పార్టీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న కూడా లేదు.


దీంతో జ‌గ‌న్ కొన్నాళ్ల పాటు అక్క‌డే ఉండిపోతాడ‌న్న‌ది మాత్రం క్లారిటీగా క‌నిపిస్తోంది. 11 సీట్ల‌తో గెలిచిన పార్టీ కోసం కార్యక్రమాలు చేపట్టినా ఫెయిల్ అవుతాయోమోనని ఆందోళన జగన్ ను బాగా టెన్ష‌న్ పెట్టేస్తోంది. అందుకే కేసీఆర్ రూట్లోనే ప్యాలెస్ లో రెస్ట్ తీసుకునే రాజ‌కీయం స్టార్ట్ చేశాడ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: