ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించని షాకిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించిన అధికారికి ప్రమోషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గత వారం రోజుల కిందట.. లోటస్ పాండ్ దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి సంబంధించిన కొన్ని కట్టడాలను ధ్వంసం చేసింది జిహెచ్ఎంసి. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని.. రెండు గదులను ధ్వంసం చేసింది జిహెచ్ఎంసి.


అయితే ఈ  కూల్చివేత రేవంత్ రెడ్డికి తెలియకుండా... దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఆదేశాల మేరకు జరిగిందని ప్రచారం జరిగింది. ఆ మంత్రి ఆదేశాల మేరకు...  రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి అధికారులు.... జగన్ కట్టుకున్న రెండు రూములను కూల్చేశారు. అయితే ఈ సంఘటన ఆ తర్వాత తెలుసుకున్న  రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. అధికారులపై యాక్షన్ తీసుకున్నారు.


ముఖ్యంగా జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి హేమంత్ పై వేటు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన పోస్టు నుంచి  బదిలీ చేశారు. అయితే తాజాగా ఇదే సంఘటనలో రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముందు కట్టడాలు కూల్చిన అదే అధికారికి ప్రమోషన్ ఇస్తూ... జగన్కు షాక్ ఇచ్చారు. జగన్ ఇంటి ముందు  వంశానికి పాల్పడిన.. అధికారికి... పది రోజుల బదిలీ వేటు వేసిన రేవంత్... మళ్లీ అతనికి ప్రమోషన్ ఇవ్వడం పై పెద్ద చర్చ జరుగుతోంది.


తాజాగా  ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ కు ప్రమోషన్ ఇస్తూ టిఎస్ ఎం ఎస్ ఐ డి సి  ఎండి గా పోస్టింగ్  ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయం బయటకు రావడంతో... రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జగన్ ఇంటి ముందు కూల్చివేతలు జరిగాయని... ఇప్పుడు కొత్త అంశాన్ని తెర పైకి తీసుకువస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్న రేవంత్ రెడ్డి.. జగన్ పై కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: