- పదవి ఆశించకుండా కష్టపడ్డ తత్వం.
- గెలుపే లక్ష్యంగా ముందడుగు.
- పవన్ కళ్యాణ్ గెలుపులో సగభాగమైన నాగబాబు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి ఆదరాభిమానాలు ఉంటాయో మనందరికీ తెలుసు.  అలాంటి ఈ ఫ్యామిలీ కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయంగా కూడా బలమైన శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకులు  మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు.  ఆయన కేవలం సినిమాలో చేసుకుంటూనే రాజకీయంగా కూడా ఎదిగారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి  కొన్నేళ్లపాటు  లీడ్ చేసి, చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేశాడు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలోనే రాజకీయంగా ఓనమాలు దిద్దుకున్న పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టి  జనాల్లోకి వచ్చాడు. ఇక అప్పటినుంచి ఆయనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ పుట్టింది.  కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కొన్నాళ్లపాటు,  సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. 


ఆ తర్వాత  జనసేన పార్టీ స్థాపించి దశాబ్ద కాలం పాటు ఎంతో కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలు పడ్డారు. అయినా వెనుదిరగకుండా   అన్న నాగబాబు సపోర్టుతో ముందుకు అడిగేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ పై ఎవరు అవాకులు, చవాకులు పేల్చిన వెంటనే స్పందించి నాగబాబు వారికి కౌంటర్ ఇచ్చేవాడు.  నా తమ్మున్ని టచ్ చేయాలంటే నా శవం దాటి వెళ్లాలంటూ పలు సమయాల్లో మాట్లాడారు. ఈ విధంగా నాగబాబు పవన్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. పార్టీ గైడ్లైన్స్ ప్రకారం  తాను పోటీ చేసే అవకాశం వచ్చినా కానీ పోటీ చేయకుండా  జనసేన, టిడిపి కూటమి నుంచి నిలబడ్డ అభ్యర్థులు అందరిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

 ఇక పిఠాపురంలో తమ్ముడు వెంట ఉండి అడుగడుగున  ప్రజలను కలుస్తూ చివరికి పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీ తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించారని చెప్పవచ్చు. అలాంటి నాగబాబు  జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని అనేక వార్తలు వినిపించాయి. కానీ పొత్తులో భాగంగా  పార్టీ నిర్ణయం వరకు ఆ సీటును బిజెపి పార్టీకి కేటాయించారు. దీంతో నాగబాబు పోటీ నుంచి తప్పుకున్నారు.  అయినా ఆయన ఎలాంటి బాధ పెట్టుకోకుండా కూటమి పార్టీని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించి తమ్ముడికి అద్భుతమైన విజయాన్ని అందించడంలో  ముఖ్య భూమిక పోషించారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: