తెలంగాణ రాజకీయాల్లో అటు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఎంతో జోరుగా సాగుతోంది. ఏకంగా ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీలోని కీలకమైన నేతలందరినీ కూడా కాంగ్రెస్ లో చేర్చుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు అని చెప్పాలి. ఇప్పటికే కారు పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా హస్త గూటికి చేరుకున్నారు. కేకే, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా మరికొంతమంది నేతలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


అయితే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఇది నిజం అయ్యేలాగే కనిపిస్తుంది అని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు పార్టీకి గుడ్ బై చెప్తూ చెయ్యి అందుకుంటున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు అదే పార్టీలో చేరుతూ ఉండడం పై ఎప్పటినుంచో హస్తం పార్టీలో ఉంటున్న నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.


 కాగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంపై అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించారు. పార్టీ నియమ నిబంధనలను పాటిస్తానని చెప్పారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోనందుకు అసంతృప్తికి గురైనట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని.. మంత్రి శ్రీధర్ బాబు చెప్పినట్లు జీవన్ రెడ్డి ఇటీవల తెలిపారు. ఇలా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రత్యర్ధులుగా ఉండి హస్తం పార్టీ పైన విమర్శలు చేసిన వారిని ఇప్పుడు ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటూ ఉండడంతో ఇక హస్తం పార్టీలో కూడా నిరసన గళాలు తెర మీదకి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mlc