ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం చాలా డబ్బులు వృధా చేసిందని టీడీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఇంతకుముందు ఇండియా హెరాల్డ్‌లోనే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వాలంటీర్లకు న్యూస్ పేపర్ అలవెన్స్ కిందట కొంత డబ్బును నెలనెలా జారీ చేసిందని రిపోర్ట్ చేశాము. అయితే ఈ నెల వారీ భత్యం వల్ల ఏపీ ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందో గణాంకాలతో సహా టీడీపీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ నష్టానికి సంబంధించిన వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది.

 గత వైసిపి ప్రభుత్వం సాక్షి వార్తాపత్రికను కొనుగోలు చేయడానికి 2.6 లక్షల మంది వాలంటీర్లకు నెలకు రూ.200 ఇచ్చింది.  ఇది సాక్షికి అందించే సాధారణ ప్రకటనల నుంచి వేరుగా ఉంది. ఈ భత్యం సాక్షి సర్క్యులేషన్‌కు దోహదపడింది. అంటే అంత మంది పాఠకులు వారికి లభించినట్లు అయింది. అయితే, ఇప్పుడు టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నందున, ఈ “సాక్షి” భత్యాన్ని నిలిపివేస్తూ కొత్త ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో, ఈ పథకం కోసం ప్రభుత్వం మంత్లీ రూ.5.3 కోట్లు లేదా సంవత్సరానికి సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేసింది.

ఈ భృతిని నిలిపివేయడం ద్వారా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.300 కోట్లు ఆదా చేస్తుంది, ఈ మొత్తం సాక్షి జేబుల్లోకి వెళ్లకుండా చేస్తుంది. ఆ రూ.300 కోట్లు మిగుల్చుకొని రాష్ట్ర ప్రజలకి ఏదో ఒక మంచి చేసే అవకాశం ఉంది. ఇంకా వైసీపీ ప్రభుత్వం స్వలాభం కోసం  ఇలాంటి ఎన్నో వృధా ఖర్చులు పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిందని అంటున్నారు అవి కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ అర్హత లేని వారికి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు జగన్ సొంత పత్రిక కోసం ప్రజా సొమ్మును వాడుకున్నారని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: