సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు ఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ ఫండ్స్ అనేవి గత ప్రభుతం హయాంలో రాలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏపీలో ప్రస్తుతం ఏర్పాటైన కూటమి ప్రభుతం అయినా ఎమ్మెల్యేలకు అలంటి వెసులుబాటు కల్పిస్తుందా లేదా అన్న ప్రశ్న ఇపుడు సర్వత్రా నెలకొంది. అవును, తన సొంత నియోజకవర్గాల పరిధిలో ఏదైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉండడంతో ఎమ్మెల్యేలకు ఒకప్పుడు విలువ, గౌరవం ఉండేది. కానీ జగన్ ప్రభుత్వంలో అలాంటిది ఏమీ లేదని ఎమ్మెల్యేలు చాలాసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద ప్రతిపాదనలు పెట్టినా కూడా అమలు కాలేదనే వాదనలు కూడా వినిపించేవి.

ఇక అలాంటి వాదనలు వినిపించినపుడు అంతా సెంట్రలైజేషన్ అయిపోయింది కదా. సంక్షేమానికి ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది వేరేగా మీరు ఇక ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటి? అని గత ప్రభుత్వ ఆలోచనగా ఉండేది. అలా మొత్తంగా గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల మాదిరిగానే మారిపోయారు. కోట్లు ఖర్చు చేసి గెలిచి వచ్చిన ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించి ఒక పైసా కూడా ఖర్చు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇది కూడా వైసీపీలో అసంతృప్తి పెంచేలా చేయడంతో జనాలకు ఎమ్మెల్యేలకు కనెక్షన్ కట్ అయింది. ఇంకేముంది... కట్ చేస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది.

దాంతో ఇపుడు ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సో కాల్డ్ ఎమ్మెల్యేలు. అయితే ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎక్కడ నుంచి వస్తాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇపుడు జగన్ ప్రభుత్వం కంటే మొత్తం నిధులను కూటమి ప్రభుత్వం సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీ కంటే మిన్నగా పధకాల వర్షం కురిపించారు. కాబట్టి ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయిన ఏపీకి ఇటువంటి పనులు తలకు మించిన భారం. బాబు ఏపీని అభివృద్ధి చేస్తారనే ప్రజలు ఓట్లు వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ప్రభుత్వ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది వేరేగా ఎమ్మెల్యేలకు స్పెషల్ గా డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: