వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  దారుణంగా ప్రవర్తించాడు. టిడిపి నాయకులపై అనవసరంగా కేసులు పెట్టి జైల్లోకి పంపించాడు. అంతేకాదు టిడిపి ఆఫీసులపై దాడులు చేయించి విపరీతంగా కించపరిచాడు. ఇదే తరుణంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వల్లభనేని వంశీ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా లాగే ప్రయత్నం చేస్తుంది టిడిపి సర్కార్.  ఆయన చేసిన అరాచకాలు, దాడులు వీటన్నింటిపై ఉన్నటువంటి కేసులు అన్నింటిని బయటకు తీసి వల్లభనేని వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలనే అడుగులు వేస్తోంది. గన్నవరంలో టిడిపి కార్యాలయంపై దాడి కేసులో  ఇప్పటికే వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేశారు.

 ఇందులో మాజీ ఎమ్మెల్యే వంశీ నేరుగా పాల్గొన పోయినప్పటికీ ఆయన ఎమ్మెల్యే హోదాలో ఉండి వారి నాయకులను రెచ్చగొట్టి అక్కడికి పంపారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరుణంలో మొన్నటి వరకు వైసిపి ప్రభుత్వం ఉండడం వల్ల పోలీసులు ఆయనను ఏమీ చేయలేకపోయారు.  ప్రస్తుతం టిడిపి అధికారంలోకి వచ్చింది వంశీ అరాచకాలపై ఒక్కొక్కటి బయటకు తీయాలని పోలీసులకు ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. టిడిపి కార్యాలయాలపై దాడి చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టవద్దని  ఆదేశాలు రావడంతో గత నెల 9వ తేదీన  బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా  15 మందిని అరెస్టు చేశారు పోలీసులు. మరి కొంతమంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

 ఇందులో ముఖ్యంగా వల్లభనేని వంశీ లాంటి కీలక లీడర్లు అంతా  పరారీలో ఉన్నట్టు సమాచారం. అయితే వీరిని కూడా అరెస్టు చేయాలని టిడిపి నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో  పోలీసులు వీరిని వెతికే పనిలో పడ్డారు. వంశీ ఎప్పుడైతే గన్నవరంలో ఓడిపోయారో అప్పటినుంచి హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇదే తరుణంలో అరెస్టులు చేస్తున్న విషయం తెలుసుకున్న వంశీ హైదరాబాద్ కూడా వదిలి అమెరికా పారిపోయారని ఒక టాక్ వినిపిస్తోంది. నిజంగానే ఆయన అమెరికా వెళ్లారా, లేదంటే హైదరాబాదులోనే ఉన్నారా అనేది పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.  హైదరాబాదులో ఉంటే మాత్రం తప్పక ఆయనను అరెస్టు చేస్తారని సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: