రాజకీయాలలో అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మరో ఐదేళ్ల తర్వాత అధికారంలో ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్నకు సమాధానం కచ్చితంగా చెప్పలేము. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లోకేశ్ పుట్టుక గురించి గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలవడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి ఆత్మాభిమానాన్ని కించపరిచేలా వంశీ కామెంట్లు చేశారు.
 
ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. వల్లభనేని వంశీ గతంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటంతో దిగజారుడు కామెంట్లు చేశారు. లోకేశ్ రెడ్ బుక్ లో సైతం వల్లభనేని వంశీ పేరు ఉందని వల్లభనేని వంశీ చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
 
వల్లభనేని వంశీ పాపాలు పండాయని ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని పోలీసులు 71వ ముద్దాయిగా పేర్కొన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 18 అందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాడిలో వంశీ నేరుగా పాల్గొనలేదు కానీ ఆయన ప్రోద్బలంతో వైసీపీ దాడులు చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వంశీ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివశిస్తుండటం గమనార్హం. వంశీ అరెస్ట్ కోసం గురువారం రోజున మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు వెళ్లాయని తెలుస్తోంది. వంశీ ఇప్పటికే అమెరికాకు వెళ్లారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వల్లభనేని వంశీపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయనకు ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వల్లభనేని వంశీ పొలిటికల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడినట్లేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: