అందులో భాగంగానే కొత్త కార్యవర్గం కోసం చర్యలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఏసీఏ అధ్యక్షుడిగా పలువురి పేర్లు పరిశీలనలోకి వస్తున్నా కూడా ఎక్కువగా పవన్ రెడ్డి వైపే ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన జెసి పవన్ రెడ్డి అక్కడ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో పోటీ చేయాలనుకున్నా.. చివరికి చంద్రబాబు అనంతపురం లోక్సభ టికెట్ ను బీసీ అభ్యర్థికి కరారు చేయడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అంతేకాదు తాడిపత్రిలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన అస్మిత్ రెడ్డి కోసం గట్టిగా పని చేశారు పవన్ రెడ్డి. ఇక అందులో భాగంగానే పవన్ రెడ్డి జేసి అస్మిత్ రెడ్డి గెలుపుకు పూర్తిస్థాయిలో సహాయపడిన విషయం తెలిసిందే
ఇప్పుడు ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే జేసీ దివాకర్ రెడ్డి పెద్దగా బయట కనిపించడం లేదు అందుకే పవన్ రెడ్డి నీ మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలని జెసి ప్రభాకర్ రెడ్డి ఆలోచిస్తున్నారట.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జేసీ పవన్ రెడ్డికి అంతర్జాతీయ క్రికెటర్లతో మంచి స్నేహబంధం ఉంది ..క్రికెట్ పాలన పై అవగాహన ఉంది. అందుకే ఆయన అయితే ఏసీఏను గాడిన పెట్టగలరని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే జెసి పవన్ రెడ్డి తో పాటు క్రికెటర్ ఎంఎస్కే ప్రసాదు పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే జెసి పవన్ రెడ్డి ఆసక్తిగా ఉండడంతో గట్టిగా ప్రయత్నిస్తే ఆయనకే ఖరారు అయ్యే అవకాశం ఉందని ఏ సీ ఏ వర్గాలు కూడా చెబుతున్నాయి. మొత్తానికైతే ఈ పదవి దక్కించుకోవాలని అభిమానులు కూడా కోరుతున్నారు.