మిగులు పప్పు, బియ్యం అమ్మిన తర్వాత వచ్చిన లాభాల్లో 70% కమిషన్ రూపంలోనే పోతుంది. ఈ రేషన్ డీలర్ల సమస్యలకు ఏ ప్రభుత్వము కూడా శాశ్వతమైన పరిష్కారం చూపించలేదు. ఇది చాలాదన్నట్టు మారిన ప్రతి ప్రభుత్వం కూడా వారిని వేధిస్తూ వస్తోంది. ఉదాహరణకు ఏపీ మాజీ సీఎం జగన్ వాహనాల ద్వారా రేషన్ అందించారు. దీనివల్ల డీలర్లకు ఓన్లీ కమిషన్ మాత్రమే మిగిలింది. దీనివల్ల వారికి కొంత నష్టం, కొంత లాభం చేకూరింది. ఇక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో రేషన్ షాపులను బలవంతంగా లాక్కుంటున్నారు.
ఒక కౌన్సిలర్ తన సొంత సిస్టర్ రేషన్ షాప్‌ను కొంతమంది ఇలాగే లాగేసుకున్నారని చెబుతూ కండతడి పెట్టుకున్నాడు. పుత్తూరులో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. టీడీపీ లీడర్ జీవరత్నం నాయుడు ఈ సంఘటన గురించి మాట్లాడుతూ కౌన్సిలర్లు అందరూ అధికార ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అందరూ ఒకటిగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే టిడిపి ఈ కూటమి చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు అసలు పొంతనే లేదని కౌన్సిలర్ రాధా మండిపడ్డారు. తన అక్క మంజుల రేషన్ షాపును కొంతమంది టిడిపి లీడర్లు బలవంతంగా లాగేసుకున్నారని ఆమె ఆరోపించారు.
ఒక రాత్రిపూట వచ్చే రేషన్ షాప్ పోతానికి అక్కర్లేదు అని అక్క మంజుల చేత సంతకం పెట్టించుకుని వెళ్లారని ఆమె అన్నారు. తన అక్క ఐదేళ్లుగా ఎలాంటి ఆరోపణ లేకుండా చక్కగా రేషన్ షాప్ నడుపుతున్నారని కానీ టీడీపీ లీడర్లు కావాలనే రేషన్ షాపును ఆమె నుంచి తీసుకున్నారని వాపోయారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి.