ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా టెట్ అభ్యర్థులకు అలర్ట్ విధించింది విద్యాశాఖ. ఇకపోతే పరీక్ష మొత్తం రెండు పేపర్లు ఉంటుంది పేపర్ -1A ఎస్ జి టి టీచర్లకు, పేపర్ -1B స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ టీచర్లకు ఉంటుంది. పేపర్ -2A స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్ - 2B స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారని దరఖాస్తులు పొందుపరిచారు. పేపర్ -1, పేపర్ -2 పరీక్షలలో మొత్తం 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 150 మార్కులకు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్ ల చొప్పున ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది.
మొదటి సెషన్ ఉదయం 9:30 గంటలకు నుండి మధ్యాహ్నం 12:00 గంటలకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందని తెలిపారు.. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 20 తేది వరకు ఈ టెట్ పరీక్షలు జరుగుతాయని కూడా తెలిపారు . ప్రాథమిక ఆన్సర్ కీ అక్టోబర్ 4 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. తుది ఆన్సర్ కీ అక్టోబర్ 27న విడుదల కానుండగా, టెట్ ఫలితాలు నవంబర్ 2 న ప్రకటిస్తామని స్పష్టం చేశారు విద్యాశాఖ అధికారులు.