* రాజకీయంగా ఓనమాలు నేర్పిన గురువుకే పోటీగా నిలిచిన రజిని
* స్థానిక ప్రజలను ఆకట్టుకోవడంలో రజిని పబ్లిసిటీ స్టంట్ సక్సెస్
* ఎమ్మెల్యే గా గెలుపొందిన మొదటి సారికే దక్కిన మంత్రి పదవి
2014 రాష్ట్ర విభజన జరిగిన సమయంలో చాలా మంది ఎన్ఆర్ఐ లు టీడీపీకి సపోర్ట్ గా నిలవడంతో రజిని కూడా టీడీపీకి సపోర్ట్ చేసింది.విడుదల రజిని ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీ లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.స్థానిక ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయిన ప్రత్తిపాటి పుల్లరావును ఆమె రాజకీయ గురువుగా భావించింది. అలాగే నిత్యం ప్రజలలో మమేకం అవుతూ ఆమె స్థాపించిన విఆర్ ఫౌండేషన్ ద్వారా పేద వారికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది..ఆమె టాలెంట్ గుర్తించిన పుల్లారావు 2017 లో విశాఖపట్నంలో జరిగిన మహానాడు సభలో చంద్రబాబుకు పరిచయం చేసారు. అలాగే మొదటి సారి మహానాడు సభలో రజిని చేసిన ఒక్క ప్రసంగం చంద్రబాబుతో సహా తెలుగు ప్రజానీకం అంతా కూడా ఆశ్చర్యపోయారు.హైదరాబాద్ లోని సైబరాబాద్ లో మీరు నాటిన ఒక మొక్కను అంటూ ఆమె స్పీచ్ అదరగొట్టింది.ఇలా ప్రజలలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.
అయితే 2019 ఎన్నికలలో రజని తనకు చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరింది.కానీ టీడీపీ నేత చంద్రబాబు అందుకు అస్సలు ఒప్పుకోలేదు.సీనియర్ నేత పుల్లారావును కాదని తనకి సీటు ఇవ్వలేనని ఆయన తేల్చి చెప్పారు..దీనితో ఆమె తన గురువుని సైతం ఎదిరించి వైసీపీ లో చేరారు.రజిని క్రేజ్ చూసిన జగన్ స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ ను కాదని రజనికి టికెట్ కేటాయించారు..ఎమ్మెల్యే టికెట్ పొందిన రజిని విస్తృతంగా ప్రచారం చేసి అలాగే స్థానిక సమస్యలను ఎంతో అవగాహన చేసుకుంది.ఎమ్మెల్యే గా గెలిపిస్తే పెండింగ్ లో వున్న ప్రతి పని పూర్తి చేస్తామని ఆమె తెలిపారు.అలా ఆమె ప్రత్తిపాటి మోసాలు కూడా ప్రచారం చేసింది. దీనితో స్థానిక ప్రజలు ఆమెను గెలిపించారు..అంతే కాకుండా ఎమ్మెల్యే అయిన మొదటి సారికే ఆమె మంత్రి పదవి అందుకుంది
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మాత్యులుగా ఆమె పని చేసారు.ఇలా ఆమె రాజకీయ జీవితం ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు కొనసాగింది.అయితే మంత్రిగా ఆమెపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. గ్లామర్ కి తప్ప ప్రజలకు ఇంపార్టెన్స్ ఇవ్వదని ఆమెపై వదంతులు ఏర్పడ్డాయి. దీనితో సామజిక సమీకరణాల దృష్ట్యా రజిని ఈ సారి ఎన్నికలలో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది..అయితే రాష్ట్రంలో వైసీపీ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో 2024 ఎన్నికలలో రజిని భారీ మెజారిటీ తేడాతో ఓడిపోయారు.