- యువజన కాంగ్రెస్ తో పాలిటిక్స్ లోకి ఎంట్రీ..
- రాజకీయం నేర్పిన గురువుపైనే కేసీఆర్ విజయం..
- తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా చరిత్ర..

 
కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలియాస్ కేసీఆర్. ఈయన పేరు చెప్తే దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు. చివరికి రాష్ట్రాన్ని సిద్ధింపజేసి రెండుసార్లు వరుసగా సీఎం అయ్యారు. అలాంటి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకువచ్చి పేద ప్రజల దేవుడయ్యారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికే తలమానికం అని చెప్పవచ్చు. రైతుబంధు,రైతు బీమా ఇలా రైతుల కోసం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో అద్భుత పథకాలు తీసుకొచ్చిన ఘనుడు. రాజకీయాల్లో కేసీఆర్ వేసినటువంటి వ్యూహాలు ఎవరు వేయలేరని చెప్పవచ్చు. అలా రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన మెజారిటీ సాధించి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇక మూడవ సారి కూడా తానే గెలుస్తాననుకున్నాడు.కానీ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. అలాంటి కేసీఆర్ రాజకీయం ఎప్పుడు మొదలైంది.. రాజకీయ గురువును ఎప్పుడు ఓడించారు.. అనే వివరాలు చూద్దాం.

 గురువును ఓడించిన ఘనుడు:
 విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు.ముందుగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ 70వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. 1977 లోక్సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పక్షాన నిలిచాడు. అలా తన రాజకీయ గురువు అయినటువంటి మదన్మోహన్ పై 1983లో స్వతంత్ర అభ్యర్థిగా సిద్దిపేట నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పొందాడు.  ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ స్థాపన జరిగింది.  దీంతో కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ సిద్దిపేట నుంచి 1985లో పోటీ చేసి మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యాడు.


అదే ఆయన తొలి విజయం. అలా 1985లో  తన రాజకీయ గురువు అయినటువంటి మదన్మోహన్ పై అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు. అలా 1989,1994, 1999, 2001  నుంచి మొదలు 2023 ఎలక్షన్స్ వరకు వరుసగా విజయాలు సాధిస్తూనే వచ్చారు. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అలా కేసీఆర్  కొన్నాళ్ళపాటు ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించి చివరికి తానే టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు.  అప్పటినుంచి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చారు. ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టారో అప్పటినుంచి  టిఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించేసారు. చివరికి ప్రత్యేక రాష్ట్రానికి రెండు సార్లు ఆయనే సీఎం గా సేవలందించి మూడవసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: