• ఒడిశాలో నవీన్ పట్నాయక్ కోటని కూల్చేసిన బీజేపీ 
• అడుగు దూరంలో ఉన్న నవీన్ పట్నాయక్ రికార్డుకి అడ్డుకట్ట వేసిన బీజేపీ 


ఒడిశా - ఇండియా హెరాల్డ్ : ఒడిశా రాష్ట్రంలో ఏకంగా 24 ఏళ్ల పాటు సీఎంగా ఏకచత్రాధిపత్యం చెలాయించిన  బిజూ జనతాదళ్‌(బీజేడీ) అధినేత నవీన్‌ పట్నాయక్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడటం నిజంగా షాక్ కి గురించి చేసే విషయం. ఒడిశా రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శించిన ఆయనకు బీజేపీ ఎట్టకేలకు బ్రేక్ వేయగలిగింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజూ జనతాదళ్‌ పరాజయం పాలైంది. ఇది నిజంగా నవీన్ పట్నాయక్ కి ఘోర అవమానంగా చెప్పుకోవచ్చు.147 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు గెలవగా... బీజేడీ మాత్రం 51 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.ఇక మరోవైపు మిగతా స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ, సీపీఎం, స్వతంత్రులు పంచుకొన్నారు. దీంతో ఒడిశా రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. బీజేపీ నేత మోహన్ చరణ్ మాజీ ప్రస్తుతం ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 


రెండు స్థానాల నుంచి పోటీచేసిన నవీన్‌ పట్నాయక్‌ ఒక చోటనే గెలవగా మరోచోట ఓడిపోవడం అనేది షాకింగ్ విషయం.ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమితో అత్యధిక కాలం సీఎంగా చేసి రికార్డు సృష్టించే అవకాశాన్ని నవీన్‌ పట్నాయక్‌ కోల్పోవడం జరిగింది. నవీన్‌ పట్నాయక్‌ 2000 మార్చిలో మొదటి సారి ముఖ్య మంత్రయిన నాటి నుంచి ఇప్పటి దాకా సీఎంగా 2024 దాకా కొనసాగారు. ముఖ్యమంత్రిగా ఏకంగా 24 ఏండ్ల 90 రోజులకు పైగా పనిచేశారు. ఇప్పుడు మరోసారి కనుక గెలిచి, అధికార పీఠం ఎక్కి ఉంటే.. అత్యధిక కాలం సీఎంగా చేసిన వారిలో సిక్కిం మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ రికార్డును నవీన్ పట్నాయక్‌ దాటేసేవారు. కానీ ఆ రికార్డ్ చిటికెలో బీజేపీ లాగేసింది.చామ్లింగ్‌ సిక్కిం రాష్ర్టానికి ఏకంగా 24 ఏండ్ల 165 రోజులు సీఎంగా విధులు నిర్వర్తించారు. దీర్ఘకాలం సీఎంగా చేసిన వారిలో చామ్లింగ్‌ తరువాత నవీన్‌ పట్నాయక్‌, జ్యోతిబసు(పశ్చిమబెంగాల్‌-23 ఏండ్ల 137 రోజులు), గెగాంగ్‌ అపాంగ్‌(అరుణాచల్‌ప్రదేశ్‌-22 ఏండ్ల 250 రోజులు), లాల్‌ థధ్వాల్‌(మిజోరం- 22 ఏండ్ల 60 రోజులు),వీరభద్రసింగ్‌(హిమాచల్‌ప్రదేశ్‌- 21 ఏండ్ల 13 రోజులు) నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: