ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో ఆ కుటుంబానిదో ప్రత్యేకత. దాదాపు ఐదు దశాబ్దాలుగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న ఫ్యామిలీ వారిది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసింది. అన్నదమ్ములు ఇద్దరు చెరోచోట నుంచి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పీలేరు నుంచి తమ్ముడు kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి అన్న kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పీలేరు నుంచి మూడోసారి బరిలోకి దిగిన తమ్ముడిని అసెంబ్లీకి పంపిన ఓటర్లు రాజంపేట పార్లమెంట్ నుంచి తొలిసారి పోటీ చేసిన అన్న కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం ఆశీర్వదించలేదు.
దీంతో ఎన్నికల్లో తమ్ముడు కిషోర్ గట్టెక్కితే అన్నకు మాత్రం ఓటమి తప్పలేదు. పీలేరు ఎమ్మెల్యేగా kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 25 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014, 19 ఎన్నికల్లో ఓడిపోయిన కిషోర్ మూడో ప్రయత్నంలో గెలిచారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జిల్లాలో కీలక నేతగా ఉన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని సీఎం సొంత జిల్లా నుంచి క్యాబినెట్ లో బెర్త్ కాయం అనుకున్నారు. నల్లారి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ తో ఈసారి కచ్చితంగా మంత్రి అవుతారని ఎన్నికలకు ముందు నుంచి క్యాడర్ లో ప్రచారం జరిగింది.
ప్రమాణ స్వీకారమే తరువాయి అన్నట్లు కిషోర్ అనుచరగనం సిద్ధమై అమరావతికి వెళ్లారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీఎం చంద్రబాబు మినహా క్యాబినెట్ లో ఎవరికి ఛాన్స్ దక్కకపోగా అన్నమయ్య జిల్లా నుంచి అనూహ్యంగా రాంప్రసాద్ రెడ్డికి అమాత్య యోగం దక్కింది. మంత్రి పదవి దక్కకపోవడంతో నల్లారి కిషోర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడికి అవకాశం దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఆయన అనుచరగణం. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం కష్టపడ్డ అతనికి గుర్తింపు ఇవ్వలేదన్న అసంతృప్తితో పార్టీ వ్యవహారాల్లో, ఇతర కార్యక్రమాల్లో అంత చురుగ్గా కనిపించడం లేదు నల్లారి కిషోర్. ఇటు బీజేపీలో కీలక పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి వెయిట్ చేస్తున్నారట.