తెలంగాణ బిజెపిలో అంతర్గత పోరు నడుస్తుందా ? ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ‌ర్సెస్ తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేల మధ్య రోజుకు గ్యాప్ పెరుగుతుందా? కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలను కూడా పార్టీ కార్యక్రమంలో భాగస్వామం చేసేందుకు కిషన్ రెడ్డి ఎంత మాత్రం ఇష్టపడటం లేదా ? అంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చల ప్రకారం అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. తెలంగాణ బిజెపిలో అంతర్గత పోరు రోజురోజుకు ముదురుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ... ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరుగుతున్నట్టు సమాచారం. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఎంత మాత్రం ఆహ్వానం లేదని తెలుస్తోంది.


అసలు అసెంబ్లీ సమావేశాలలో ఇలాగే వ్యవహరించాలి అన్నదానిపై కిషన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున‌ పెట్టేందుకు విపక్షాల ముందుగానే సమావేశమై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తాయి .. కానీ బిజెపి ఎమ్మెల్యేలకు మాత్రం రాష్ట్ర నాయకత్వం ఎలాంటిది దేశం చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బిజెపి తరఫున మొత్తం గత అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో 8 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి - రాజాసింగ్ మాత్రమే సీనియర్లు.. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు పూర్తిగా కొత్తవారే.


ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు కావలసిన సబ్జెక్టు రాష్ట్ర నాయకత్వమే సమకూరుస్తుంది. బిజెపి నాయకత్వం మాత్రం తమకు ఏం ?పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. పార్టీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి తో పాటు సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని కూడా కిషన్ రెడ్డి పట్టించుకోవటం లేదని అంటున్నారు. ఏది ఏమైనా కిషన్ రెడ్డి కేంద్రంగా కొత్త గ్రూపు నడుస్తూ ఉండటం ... త్వరలోనే కిషన్ రెడ్డిని మార్చేసి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తారన్న ఆలోచనతోనే మహేశ్వర్ రెడ్డి - రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వంపై పూర్తి మౌనంతో ఉంటున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: