( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఎలాగైనా మరోసారి తానే అధికారంలోకి వస్తానని మరో ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని.. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఎన్నో కలలు కన్నారు.. అయితే ఆంధ్రప్రదేశ్ ఓటరు మాత్రం వైసిపికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. వైసిపి నే కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది.. నిన్న మొన్నటి వరకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఈరోజు కనీసం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న నేత కూడా కాదు.. జగన్ రెడ్డి ఇప్పుడు కేవలం పులివెందులకు ఎమ్మెల్యే మాత్రమే.


అయితే జగన్ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. జగన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఓడిపోయాక గత 40 రోజులకు వ్యవ‌ధి లో నాలుగు సార్లు బెంగళూరుకు వెళ్లారు అంటేనే జగన్ ఆంధ్రలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు అని తెలుస్తోంది. జగన్ ఎక్కువగా బెంగళూరులోని తన ఎలహంక ప్యాలెస్ లో ఉండేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు.. అలాగే మధ్యలో ఒకటి రెండు సార్లు హైదరాబాద్ కూడా వెళ్లి వచ్చారు.


జగన్ కేవలం అధికారం ఉంటే మాత్రమే ఆంధ్రలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎన్నికలలో ఎప్పుడైతే చిత్తుచిత్తుగా ఓడిపోయారో అసలు ఈ రాష్ట్రంలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు ... అని స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణ గత 40 రోజులలో నాలుగు సార్లు బెంగుళూరు వెళ్ళటం అంటేనే తెలుస్తోంది.. బెంగళూరు నుంచి గత మంగళవారం తిరిగి వచ్చిన ఆయన శుక్రవారం మళ్లీ వెళ్లారు.. ఇక ఆంధ్రప్రదేశ్లో పార్టీ వ్యవహారాలు కొందరు కీలక నేతల చేతిలో పెట్టి జగన్ పూర్తిగా బెంగళూరులోనే ఎక్కువ కాలం గడిపే ఆలోచనలు.. ప్రయత్నాలలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: