ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎక్కువగా కొన్ని రకాల వాటిపైన బాధ్యతలు స్వీకరించి ముందుకు వెళ్తున్నారు.. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని వ్యవహారాల పైన ఇప్పటికే శ్వేత పత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే గడిచిన కొద్దిరోజుల క్రితం మదనపల్లిలో జరిగిన రెవెన్యూ శాఖ పరిధిలో ఉండేటువంటి ఘటన వల్ల సీఎం చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


 ఏపీ సీఎం తాజాగా ప్రతి జిల్లాలో రెవెన్యూ కు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించాలని అందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ తెలియజేశారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖను  చాలా నిర్వీర్యం చేశారు అంటూ అందుకు ఉదాహరణగా ఈ మదనపల్లి గటనే అంటూ తెలియజేశారు. రెవెన్యూ శాఖను కచ్చితంగా 100 రోజులలోపు గాడి పెడతామని రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నామంటూ తెలిపారు. భూకబ్జాదారుల పైన కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సమస్యలను విభాగాలుగా విభజించి పరిష్కరిస్తామంటూ తెలియజేశారు.


అలాగే ఎవరైతే వినతులు ఇచ్చేందుకు తమ వద్దకు రాకుండా ఆయా జిల్లాలలోని ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. నియోజవర్గాలు జిల్లాలలో ఫిర్యాదులు తీసుకునేలా అన్ని ఏర్పాట్లు త్వరలోనే చేస్తున్నామని తన పర్యటనల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని తెలియజేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో అన్నిచోట్ల కూడా మార్పులు తీసుకువస్తావని శాఖల వారిగా సమీక్షలు అన్ని నిర్వహిస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంలో చాలా మంది భూకబ్జా వంటివి చేసినట్లుగా వార్తలు వినిపించాయి.. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసినట్లుగా కూడా తెలియజేశారు. అలాగే పాస్ బుక్కులను కూడా రాజు ముద్ర వేసి కొత్త బుక్కులను ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: