కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి రెండు నెలలు కావస్తూ ఉన్న వేళ టిడిపి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సైతం అమలు చేసే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్నది. మరికొన్ని పథకాలు ఈ ఏడాదికి రాలేవని..వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటూ కూడా తెలియజేశారు.. అలాగే టిడిపి సూపర్ సిక్స్ హామీలే కాదు కానీ జనసేన పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల పైన మాత్రం ఎవరు ఇప్పటివరకు మాట్లాడడం లేదు.. సరిగ్గా ఈ సమయంలోనే హరి రామ జోగయ్య కూడా స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా అమలు చేయాలంటూ హరి రామ జోగయ్య లేఖలో రాశారు.
ఈ పథకాలతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా యువకులకు 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఈ పథకం పైన యువత చాలా ఆశలు పెట్టుకున్నారు. దీంతో జనసేన ఈ పథకాలను అమలు చేయాలి అంటూ జోగయ్య ఒక లేఖ ద్వారా ప్రస్తావించారు. మరి ఈ పథకాల పైన అటు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేకపోతే.. ఏం చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.