* ఆసక్తికరంగా మొదలైన హరికృష్ణ, షాలిని ప్రేమ

* ఎన్నో అవమానాలు ఎదురైనా నమ్ముకున్న మనిషి చేయి వదలని హరికృష్ణ

* కుటుంబం కాదన్న  ఊరటను ఇచ్చిన తండ్రి ఆదరణ



విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు వారసుడిగా నందమూరి హరికృష్ణ తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి సుపరిచితుడే.తండ్రి నటనాశైలిని పుణికి పుచ్చుకొని తెలుగు ప్రేక్షకుల చేత ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.రాజకీయ రంగ ప్రవేశం చేసిన తండ్రికి తోడుగా హరికృష్ణ వెన్నంటే వుండే వారు.చైతన్య రధాన్ని నడిపి తన తండ్రి అద్భుత విజయంలో తాను కూడా భాగస్వామి అయ్యారు.ఎన్టీఆర్ తనయులలో హరికృష్ణ అంటే ఎన్టీఆర్ కు ఎంతో ప్రేమాభిమానాలు ఉండేవి.ఆ ప్రేమతోనే ఎన్టీఆర్ హరికృష్ణ ఎం చెబితే అది చేసేవారట.అయితే హరికృష్ణ రెండో పెళ్లి విషయంలో నందమూరి కుటుంబం నుంచి అంత ఆదరణ లభించలేదు.హరికృష్ణ వారసుడు అంటే అందరికి గుర్తొచ్చేది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన తల్లి మాత్రం తెరవెనుకే వుంటారు.పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారిన కూడా ఆమె మాత్రం బయట ప్రపంచానికి దూరంగానే వున్నారు.ఎందుకంటే హరికృష్ణ ఆమెను లీగల్ గా పెళ్లి చేసుకోలేదని లివింగ్ రిలేషన్ మాదిరిగానే సహజీవనం సాగించారని అందరు చెబుతుంటారు.కానీ వారి ప్రేమ చాల విచిత్రంగా మొదలైంది.


షాలిని ఒక మ్యూజిక్ టీచర్ ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్లలకు సంగీత పాటలు చెప్పేందుకు షాలిని వచ్చేవారు.ఎన్టీఆర్ కు చేదోడువాదోడుగా వుంటూ హరికృష్ణ ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు.అప్పుడే హరికృష్ణకు ఆమెతో పరిచయం ఏర్పడింది.ఒక్కోసారి షాలినిని ఇంటి దగ్గర దిగబెట్టడానికి హరికృష్ణనే స్వయంగా వెళ్లేవారు.ఆ సందర్భంలోనే వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందట.అయితే అప్పటికే హరికృష్ణకు లక్ష్మితో పెళ్లి జరిగింది.జానకిరామ్ కూడా పుట్టాడు.కళ్యాణ్ రామ్ కడుపులో వున్నా సమయంలో హరికృష్ణ ఏకంగా షాలినితో వేరే కాపురం పెట్టారు.ఈ విషయం ఇంట్లో వారికి తెలియడంతో ఆమెను మ్యూజిక్ టీచర్ గా తొలగించారు.కానీ హరికృష్ణ మాత్రం ఇంట్లో వాళ్ళు  మందలించిన మొదటి భార్య కోప్పడిన షాలినిని వదల్లేకపోయారు.పీకల్లోతు ప్రేమలో వున్నా షాలినితో బంధం తెంచుకోలేక అలాగని కొనసాగించలేక హరికృష్ణ తల్లడిల్లిపోయారు.


షాలిని కూడా హరికృష్ణనే ప్రాణంగా భావించింది.ఆ క్రమంలోనే వారిరువురికి ఎన్టీఆర్ జన్మించాడు.నందమూరి కుటుంబ సభ్యులకు నచ్చకపోయినా ఎన్టీఆర్ మాత్రం తనకు మనవడు పుట్టాడని మురిసిపోయాడట.ఎన్టీఆర్ ను చేతిలోకి తీసుకొని ముద్దాడి తన పేరే ఎన్టీఆర్ కు పెట్టి ఆశీర్వదించారట.తన మనవడిని ఇంటికి  తీసుకు రమ్మని కూడా చెప్పారట.కానీ కుటుంబంలో కలహాలు రావడం ఇష్టంలేక హరికృష్ణ ఆ పని చేయలేదట.షాలిని మాత్రం నందమూరి కుటుంబానికి సంబంధించి ఎలాంటి వేడుకలకు హాజరు అయ్యేవారు కాదట.తన కొడుకుని చూసుకుంటూ ఒంటరిగా ఉండిపోయారని తెలుస్తుంది.షాలినిని కుటుంబానికి దూరంగా ఉంచినా కూడా తన ప్రేమనంతా కూడా  ఆమె పైనే  చూపించేవారు హరికృష్ణ.కొడుకులందరు కలిసి ఉండాలని హరికృష్ణ కోరుకునే వారు.కొన్నాళ్ళకు పరిస్థితులు మారాయి ఎన్టీఆర్ తన అద్భుతమైన ప్రతిభతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారారు.తండ్రి మాట అంటే ఎంతో గౌరవించే ఎన్టీఆర్ తన అన్నలను సైతం ఎంతో ప్రేమగా పలుకరించేవాడు.కొన్నాళ్ళకు వీరిపై మనస్పర్థలు తొలగిపోవడంతో అందరు కలిసిమెలిసి ఉండేవారు.కానీ దురదృష్టవ శాతం జానకి రామ్ మరణం హరికృష్ణను క్రుంగ దీసింది.అది జరిగిన కొన్నాళ్లకే హరికృష్ణ కూడా మరణించడంతో ఎన్టీఆర్ భాదకు హద్దులు లేకుండాపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: