తన మనసులో ఉన్న బాధను అన్నిటినీ సైతం ఇటీవలే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. బుద్ధ వెంకన్న మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తనకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ తెలియజేశారు. దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలు నేతలు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గతంలో వైసిపి హయాంలో టిడిపి కోసం ఏకంగా 37 కేసులు తన మీద పెట్టించుకున్నట్లుగా కూడా తెలియజేశారు. ఎమ్మెల్యే పదవి ఉంటేనే మాట చెల్లుబాటు అవుతుందని విషయం ఈ ఎన్నికలలో తాను గుర్తుంచుకున్నానని తెలియజేశారు.
పదవి లేకపోతే నమ్ముకున్న వారికి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ ఆయన ఆవేదనను తెలియజేశారు.ఎమ్మెల్యేలు తమకు ఇష్టమైన వారికి సీఐలుగా నియమించుకుంటున్నారని తన మాట ఎవరు వినడం లేదని తానే ఇతరుల పైన ఆధారపడవలసి వస్తోంది అంటూ తెలిపారు. ఈ పరిస్థితులలో తనని నమ్ముకున్న వారికి ఏం చేయాలని ప్రశ్నించడం జరిగింది బుద్ధ వెంకన్న.. తను నమ్మిన వారికి ఏం చేయలేకపోయాను క్షమించండి అంటూ ఈ వేదికగా తెలియజేశారు. గతంలో చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అంటూ తెలియజేశారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అడ్డు వచ్చారు చెప్పాలి అంటూ ఆయన తెలిపారు. దీంతో ఈయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అంటూ మరి కొంతమంది నేతలు కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు ..