ఉన్నత విద్యకు నిలయాలైన యూనివర్శిటీలన్నీ సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇవి అధికార పార్టీకి అనుబంధ సంస్థలుగా మారిపోయాయి. దీనికి ఉదాహరణే ప్రభుత్వం మారగానే దాదాపు అన్ని విశ్వవిద్యాలయల ఉప కులపతులు తమ పదవులకు రాజీనామాలు చేయడం.  వర్శిటీల్లో రాజకీయ జోక్యంతో విద్యా వ్యవస్థపై పర్యవేక్షణ కొరవడింది.


యూనివర్శిటీలు రాజకీయ కేంద్రాలుగా మారడంతో బోధనారంగం తీవ్రంగా నష్టపోయింది. ఏ ఒక్క వర్శిటీలోను తగినంత మంది శాశ్వత ఆచార్యులు లేరు. యూనివర్శిటీ గ్రాంట్లు కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం అధ్యాపక విద్యార్థుల నిష్పత్తి 1:20 గా ఉండాలి. ఏ ఒక్క యూనివర్శిటీలోను ఈ నిష్పత్తి లేదు. విద్యార్థులకు సరైన విద్య అందక వర్శీటీలకు పీజీ పట్టాలిచ్చే కేంద్రాలుగా మిగిలిపోతున్నాయి.


అధ్యాపకుల కొరత పరిశోధన రంగంపై మరింత తీవ్రంగా పడుతోంది. బోధన కోసం తాత్కాలిక పద్ధతుల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించుకొని నెట్టుకు వచ్చినా.. పరిశోధనా రంగం విషయంలో అటువంటి అవకాశం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రోఫెసర్లుగా శాశ్వత ఉద్యోగులకు మాత్రమే పరిశోధనలు చేయించే అవకాశం ఉంటుంది. దీంతో పరిశోధకులకు మార్గనిర్దేశం చేయాల్సిన అధ్యపకులు కొరత తీవ్రమై  ఆ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.


మొత్తంగా చెప్పాలంటే విశ్వవిద్యాలయాల్లో వీసీలు పాలనను పక్కన పెట్టి రాజకీయాలు మాత్రమే చేశారు. దీనికి సజీవ సాక్ష్యం ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన వ్యవహారం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అంశం పలువురిని విస్మయానికి గురి చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదివే విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది.  కానీ అలా చేయకుండా వాటన్నింటిని యూనివర్శిటీల్లోనే పక్కన పడేశారు.


ఎందుకు అంటే వీటిని ఏం చేయాలో అనే దానిపై సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇచ్చే వారే కరవయ్యారు. ఈ ఏడాది నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా సెమిస్టర్ విధానంలో కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఈ పుస్తకాల్లో పూర్తిగా సిలబస్ ఉండటంతో ఇందులో ఎంత వరకు చెప్పాలో తెలియక మొత్తానికే పక్కన పడేశారు. పుస్తకాల్లో ఉన్న అధ్యాయాలను సగం చేసి రెండు సెమిస్టర్ లుగా విభజించమని చెప్పే తీరిక విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: