వంద రూపాయలు తయారు ఖర్చు అవుతే.. 80 రూపాయలకే అమ్మాల్సి వస్తే.. నష్టం వాటిల్లుతుంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవాలి అంటే రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులు చేస్తుంది.. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాలు కాంట్రాక్టులు భవనాలు వంటి వాటికీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు మాత్రమే తీసుకోవాలనే కండిషన్ పెడితే.. ఎక్కువ రేట్ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఒప్పుకొని తీసుకొని ఉంటారు. కాంట్రాక్టర్ కి ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
మరొకటి వచ్చేటప్పుతికి.. నష్టాలని ఎవరు భర్తీ చేస్తారని విషయా వస్తే.. కేంద్ర ప్రభుత్వం 6000 కోట్ల రూపాయలు ఇస్తుందా.. మొన్ననే కుమారస్వామి కూడా వచ్చి వెళ్లారు.. మరొకపక్క భూపతి రాజా శ్రీనివాసరావు మంత్రిగా రావడం జరిగింది వీరు ఇప్పిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు అక్కడ ఉద్యోగులలో మొదలయ్యింది. ఇది తేలాల్సినటువంటి అంశము.. కానీ గత ఎన్నికలలో కూటమిలో భాగంగా చాలామంది నేతలు విశాఖ స్టీల్ ను ప్రైవేటీ కరణం చేయబోమని తెలియజేశారు.కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం కచ్చితంగా ఈసారి అధికారంలోకి వైసిపి పార్టీ వచ్చిందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మయ్య కుండా ప్రైవేట్ కరణం కాకుండా చూస్తారనే హామీ ఇచ్చారు. అలా ప్రస్తుతం కూటమిలో ఎవరు కనిపించడం లేదు.