*
బలవుతున్న సామాన్య ప్రజలు.!* హత్యలు,కూల్చివేతలు,కీలక నేతల అరెస్ట్.!
* అన్నా క్యాంటిన్లా వంటివి మూసివేత, పునరుద్దరణ
.!(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా వచ్చిన టీడీపీ,జనసేన, బీజేపీ భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఏపీలో ప్రతీకార రాజకీయాలు ఉండవని ఒకవైపు ప్రకటిస్తూనే మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతో కూటమి పాలన ప్రారంభించింది.గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లోటుపాట్లు బయటకు తీయాలని నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వారిపై రాజకీయంగా టార్గెట్ చేసుకున్నారు.మాజీ సీఎం జగన్ తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరికి ఉచ్చు బిగుసుకునేలాగా కూటమి ప్రభుత్వం పక్కా వ్యూహంతో దూసుకుపోతుంది. అయితే టీడీపీ అలా చేయడానికి కారణం ఉందంటున్నారు విశ్లేషకులు.గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదలా వల్లే ఈసారి ప్రజలకుటమికి మద్దతు పలికారు. దాంట్లో ముఖ్యంగా ఎన్నికల ముందు స్కిల్స్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు రెండునెలలపాటు రాజమండ్రి జైలుకు పంపేలా ప్లాన్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్.అయితే అప్పటికే జగన్ పై వ్యతిరేకత నిరుద్యోగుల్లో, ఉద్యోగుల్లో స్పష్టంగా కనబడుతున్న టైంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం అనేది సామాన్య ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. దాంతో ఆయనపై ఇంకా సింపతి పెరిగి జగన్ పై వ్యతిరేకత ఇంకా పెరిగింది. దానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలే ఊహించని విధంగా జగన్ ను దెబ్బ తీసాయి. ఈసారి కూడా జగన్ గెలిచి టీడీపీను భూస్థాపితం చేసే ఆలోచనలో ఉన్నారు కానీ దానికి విరుద్ధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో హత్యలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, కార్యకర్తల పై దాడులు వరుసగా జరుగుతున్న తరుణంలో అవన్నీ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని విపక్ష పార్టీ వైసీపీ, కూటమి ప్రభుత్వాన్నిగట్టిగ నిలదీస్తుంది.కాకపోతే వైసీపీకి ప్రతిపక్ష హోదాకూడా రాకపోవడంతో అసెంబ్లీలో చర్చించాల్సిన ఇలాంటి అంశాలు అక్కడ చర్చించలేక మీడియా సమక్షంలో అడుగుతున్నారు అయితే దానికి టీడీపీ నేతలు కూడా గట్టిగ కౌంటర్ ఇస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనకు టీడీపీ నేతలతో సహా ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.దాంట్లో భాగంగానే గత నెలలో పల్నాడులోని వినుకొండలో జరిగిన రషీద్ హత్య రాష్ట్రమంతా సంచలనం రేపింది.వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న రషీద్ అనే యువకుడిని జిలానీ నడిరోడ్డుపై కత్తితో నరికి చంపారు.అయితే ఆ హత్యను వాడుకొని దానికి రాజకీయ రంగు పులుముకునేట్లు వైసీపీ చేస్తుందని ఇది రాజకీయ హత్య కాదని వ్యక్తిగతంగా జరిగిందేనని టీడీపీ నేతలు అంటున్నారు.కేవలం అధికారం చేతిలో ఉందని ఈ అయిదు సంవత్సరాలు వాళ్ళు ఏంచేసినా తిరుగేలేదని భావించి ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ మండిపడుతున్నారు.అలాగే వైసీపీ నేతలపై కావాలని రీవెంజ్ పాలిటిక్స్ చంద్రబాబు చేస్తున్నారని అన్నారు.అయితే జగన్ అధికారంలో ఉన్నపుడు అన్నా క్యాంటిన్ లను కావాలని రద్దు చేయడం, అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం అనేది చంద్రబాబు పై ఉన్న రివేంజ్ అనేది స్పష్టంగా కనబడింది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి కూడా మరల యూనివర్సిటీకి ఎన్టీఆర్ అని పేరు మార్చడం అలాగే అన్నా క్యాంటిన్ లను మరల పునరుద్దించడం లాంటి పనులు అమలు చేస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నా పాలిటిక్స్ అనేవి ఒకరి మీద కోపంతో ఇంకొకరు నువ్వా నేనా అనేలా ఉండటం జరుగుతుంది. ఇలాగే కొనసాగితే మాత్రం ముందు ముందు రాష్ట్రం ప్రజా సేవ మర్చిపోయి పగలతో, ప్రతీకారాలతో పాలనలు జరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు.అందుకే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుకునే నాయకులు ఇకనైనా రివేంజ్ పాలిటిక్స్ మానేసి ప్రజాస్వామ్య పాలిటిక్స్ చేయాల్సిందిగా రాజకీయనాయకులు మారాలని ప్రజలు ఆశిస్తున్నారు.