* పాలన వదిలేసి వైసిపి పై పడిన కూటమి సర్కార్
* వైసిపి కార్యాలయాలే లక్ష్యంగా దాడులు
* తాడేపల్లి వైసీపీ ఆఫీస్ కూల్చివేత
* ఏపీలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన తర్వాత పరిస్థితిలు చాలా మారిపోయాయి. వైసిపి పార్టీని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా... చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు అర్థం అవుతుంది. ఎక్కడ చూసినా.. దాడులు, కూల్చివేతలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా సరిగ్గా కాలేదు. కానీ.. వైసీపీకి శిక్షలు వేస్తూనే ఉంది కూటమి సర్కార్.
జగన్మోహన్ రెడ్డి పాలనలో.. తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. కొంతమందిని జైలుకు కూడా పంపారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు కూడా జరిగాయి. కానీ అప్పుడు వైసిపి నేతలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై... దాడులు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
అక్రమంగా కట్టారని వైసిపి పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికీ తాడేపల్లి కేంద్ర వైసిపి పార్టీ కార్యాలయాన్ని కూల్చేచేశారు. నోటీసులు ఇవ్వకుండానే.. ఈ దారుణానికి పాల్పడినట్లు వైసిపి కూడా పేర్కొంది. అక్కడితో ఆగకుండా విశాఖ, అనంతపురం, కడప కర్నూలు రాజమండ్రి ఇలా చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి పార్టీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చింది చంద్రబాబు సర్కారు.
అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. వాస్తవానికి చంద్రబాబు కూటమి సర్కార్... వైసిపి కార్యాలయాలకు కూల్చివేతకు పాల్పడకుండా..పాలన పైన దృష్టి పెట్టి ఉంటే బాగుంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు కాబట్టి టిడిపి ఆడిన ఆట నడుస్తోంది. మరో ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక అప్పుడు.. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. విధ్వంసం విషయంలో చంద్రబాబు కంటే ఒక ఆకు ఎక్కువే చదివారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రివెంజ్ పాలిటిక్స్ కంటే ప్రజల పైన అదృష్ట పెడితే కూటమి సర్కార్కు మంచి మైలేజ్ ఉండే ఛాన్స్ ఉంది.