* పెద్దిరెడ్డి కుటుంబమే లక్ష్యంగా టీడీపీ దాడులు
* మైనింగ్ శాఖలో భారీగా అవినీతి
* పెద్దిరెడ్డి అనుచరులు, మిథున్ రెడ్డిలపై దాడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉండటం మనం చూస్తున్నాం. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు కూటమి సర్కార్ టార్గెట్ చేసింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అదే పనిగా ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో గతంలో... చంద్రబాబు నాయుడు కు చుక్కలు చూపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే ఇప్పుడు దానిపైన రివెంజ్ తీర్చుకుంటున్నారు చంద్రబాబు.
అడుగడుగునా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబానికి ఇబ్బందులు కలిగిస్తోంది టిడిపి ప్రభుత్వం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు మిథున్ రెడ్డిని కూడా... పుంగనూరులో అడుగుపెట్టకుండా చాలా ప్లాన్ లో వేస్తోంది టిడిపి. ముఖ్యంగా పెద్దిరెడ్డి గడిచిన ఐదు సంవత్సరాలలో చేసిన స్కామ్ లను బయటకు తీస్తోంది. మైనింగ్ శాఖగా ఉన్న పెద్దిరెడ్డి... చాలావరకు అవినీతికి పాల్పడినట్లు గుర్తించింది. వేలకోట్ల ఆదాయాన్ని సంపాదించుకున్నాడని.. అతనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది కూటమి సర్కార్.
మైనింగ్ తో పాటు... పుంగనూరు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది టిడిపీ. పెద్దిరెడ్డి అనుచరులు అలాగే అతని దగ్గర ఉన్న వైసీపీ నేతలు అందరిని టిడిపిలోకి చేర్చుకుంది. పెద్దిరెడ్డి ని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు సర్కార్. అంతేకాకుండా... మొన్న జరిగిన మదనపల్లి ఫైళ్ల దగ్ధం వెనుక కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నట్లు... చంద్రబాబు సర్కార్ అంటుంది. ఆదిశగా చంద్రబాబు సర్కార్ కూడా దర్యాప్తు చేస్తోంది.
అంతేకాకుండా... పెద్దిరెడ్డి కుటుంబానికి వ్యక్తులు అలాగే అతని అనుచరుల పైన తెలుగు తమ్ముళ్లు దాడులు చేస్తున్నారు. టార్గెట్ చేసి మరి పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నారు. అయితే.. పెద్దిరెడ్డి ఒక్కడిని చేసి చంద్రబాబు ఇలా చేయడం కూడా దారుణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదైనా ఉంటే చట్టప్రకారం చేయాలి కానీ... కక్ష కట్టి చేయకూడదని చురకలాంటిస్తున్నారు. అధికారం ఎప్పటికి శాశ్వతం కాదని... వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబుకు కూడా చుక్కలు కనిపిస్తాయి చెబుతున్నారు.