కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీకి ఝలక్ ఇచ్చారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. గులాబీ పార్టీ తీసుకొచ్చిన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు అంబటి రాయుడు. అంబటి రాయుడుకు ఇంటి స్థలం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది గులాబీ పార్టీ. అయితే ఈ డిమాండ్ పై వెంటనే స్పందించిన అంబటి రాయుడు... ఈ అంశాన్ని సున్నితంగా తిరస్కరించాడు.


మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా.. క్రీడాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజుకు గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు ఇంటి నిర్మాణం కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కూడా కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కారు. అటు బాక్సర్ నిక్కత్  కు కూడా గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్.

 

అయితే ఈ రెండు అంశాల నేపథ్యంలో...  గులాబీ పార్టీ యంగ్ ఎమ్మెల్యే పాడి కౌ శిక్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.  మహమ్మద్ సిరాజ్ కు ఇచ్చినట్లుగానే అంబటి రాయుడు అలాగే ప్రజ్ఞాన్ ఓజాకు కూడా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. వారు కూడా హైదరాబాద్ తరఫున టీమిండియా కు చాలా సేవలు అందించాలని గుర్తు చేశారు కౌశిక్ రెడ్డి.

 

అంబటి రాయుడు అలాగే ప్రజ్ఞాన ఓజాతో పాటు గుత్తా జ్వాలకు కూడా ఇవ్వాల న్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు స్పందించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కౌశిక్ రెడ్డి విచ్చేసిన వ్యాఖ్యలు చాలా సంతృప్తిని ఇచ్చాయని ఎలా ఉన్నారు అంబటి రాయుడు. తనకు ఏ ఉద్యోగం..ఇంటి స్థలం అవసరం లేదని తెలిపారు. తను ఇప్పటివరకు ఏ ప్రభుత్వాన్ని కూడా సహాయం అడగలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: