తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అని అందరిలోనూ టెన్షన్ గా ఉంది. ఇప్పటికే గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని రేవంత్ రెడ్డి పెద్ద తప్పే చేశారు. గద్వాల ఎమ్మెల్యేబండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో... కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అసంతృప్తిలోకి వెళ్లారు. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా లేదా అని టెన్షన్ అందరిలోనూ ఉందట.


ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన గురించి వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో వార్తలు రాస్తుంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. విదేశాలకు చెందిన ఓ బ్యాంకును షూరిటీ పెట్టి... కోట్లల్లోను తీసుకున్నాడు అని...  ఏబీఎన్ ఓ వార్త కథనాన్ని ప్రచురించినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న మేఘ కృష్ణారెడ్డి  పైన కూడా ఆర్టివి రవి ప్రకాష్ కూడా ఇలాంటి వార్తలే రాశారు.


ఆ వార్త నేపథ్యంలో 100 కోట్ల నష్టపరిహారం వేస్తామని సదరు బ్యాంకు రవి ప్రకాష్ ను హెచ్చరించింది. ఇక ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ... ఏబీఎన్ కూడా అలాంటి వార్తలే రాస్తుంది. అయితే దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కొంతమంది అంటున్నారు.  ఎందుకంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియాగా  పేరు గాంచింది. అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకుంటుంది.


ఇటు చంద్రబాబు చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి... ముందుకు వెళ్తాడని ఇప్పటికి అందరూ అంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైలెట్ కాకూడదని... అతని స్థాయి తగ్గించాలని నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇలా స్కెచ్ వేశాడని కొంతమంది తెలంగాణ వాదులు అంటున్నారు.  అందుకే తన అనుకూల మీడియా అయిన ఏబీఎన్తో... పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఇలాంటి ప్రచారాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్త బాగా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: